telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కియారా అద్వానీ ఆ హీరోతో రిలేషన్‌లో ఉందా…?

Kiara

ప్రస్తుతం సిద్ధార్థ్.. కియారాతో రిలేషన్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై కియారా అద్వానీ క్లారిటీ ఇచ్చేస్తోంది. బాలీవుడ్‌లో జరుగుతోన్న ప్రచారం నిజమే అని ఇండైరెక్ట్‌గా చెప్పేస్తోంది. బాలీవుడ్‌ యంగ్‌స్టర్‌తో రిలేషన్‌లో ఉందనే ప్రచారానికి ట్వీట్స్‌తో సమాధానం చెప్పేసింది కియారా. కియారా అద్వానీ బాలీవుడ్‌ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో రిలేషన్‌లో ఉందని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. వీళ్లిద్దరు లేట్‌నైట్‌ పార్టీస్‌ చేసుకుంటున్నారని, డిన్నర్‌ మీటింగ్స్‌ పెడుతున్నారని ముంబాయి జనాలు చెప్తుంటారు. అయితే ఈ ప్రచారంపై కియారా గానీ, సిద్ధార్థ్‌ గానీ ఇప్పటివరకు రియాక్ట్‌ కాలేదు. కానీ ఇప్పుడు వీళ్ల ట్వీట్స్‌తో కియారా రిలేషన్‌పై ఓ క్లారిటీ వస్తుంది అంటున్నారు నెటిజన్లు. రీసెంట్‌గా కియారా అద్వానీ హీరోయిన్‌ సెంట్రిక్ ఫిల్మ్ ‘ఇందూకీ జవానీ’ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. కియారా ట్విట్టర్‌లో ఈ ట్రైలర్‌ లింక్‌ పోస్ట్‌ చేసింది. దీనికి సిద్ధార్థ్, ఇందూ ఫుల్‌ ఫైర్‌లో ఉంది, చూడ్డానికి వెయిట్‌ చేస్తున్నామని ట్వీట్ చేశాడు. దీనికి కియారా, ఇందూ కూడా నిన్ను చూడ్డానికి ఎదురుచూస్తోందని రిప్లై ఇచ్చింది. సిద్ధార్థ్ ట్వీట్లు, కియారా రియాక్షన్లు చూసి వీళ్లిద్దరి మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ ఉందని కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు.

Related posts