telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో వారికి డీజీపీ వార్నింగ్…

mahender_reddy

జీహెచ్‌ఎంసీ‌ ఎన్నికల ప్రచారంలో రాజకీయ నేతలు చేస్తున్న ప్రసంగాలు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయి.. అయితే, మత విద్వేషాలు రెచ్చ గొట్టే లా ఉన్న ప్రసంగాలను పరిశీలిస్తునాం.. విద్వేషాలు రెచ్చ గొడుతున్న నేతల పై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి… గ్రేటర్‌ ఎన్నికల వేళ మీడియాతో మాట్లాడిన ఆయన.. సర్జికల్ స్ట్రైక్ చేస్తాం అన్న నేతల పై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఇక, రోహింగ్యాలపై ఇప్పటి వరకు 50 -60 కేసులు నమోదు చేశామని గుర్తుచేసిన డీజీపీ.. క్రిమినల్ చరిత్ర ఉన్న వారే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని వెల్లడించారు. ఓయూ రిజిస్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో తేజస్వి సూర్య పై కేసు నమోదు చేశామన్న ఆయన.. ఇప్పటి వరకు రాజకీయ నాయకుల పై 50 కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. హైదరాబాద్‌లో గత 6 సంవత్సారాల్లో ఎలాంటి ఘటన చోటు చేసుకోలేదన్నారు డీజీపీ మహేందర్‌రెడ్డి… హైదరాబాద్‌లో శాంతి భద్రతలను కాపాడటం పోలీసుల ప్రధాన బాధ్యతగా స్పష్టం చేసిన ఆయన.. గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందన్నారు. పోలీసులు తీసుకునే ప్రతి చర్య కు ప్రజల సహకారం అవసమని.. కొన్ని చోట్ల కొంత మంది విద్వేషాలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు మా దగ్గర సమచారం ఉందన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు.. నూతన టెక్నాలజీ ఉపయోగించి పోస్ట్ సృష్టి కర్తల పై చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసిన మహేందర్‌రెడ్డి.. విద్వేష పోస్టులు, అసాంఘిక వ్యక్తుల చర్యల్లో చిక్కకుండా ప్రజలు సమచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని కోరారు.. గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు ప్రశాంతంగా పాల్గొనేలా చూడటం పోలీసుల ముందున్న ప్రధాన కర్తవ్యం.. ఎలాంటి రూమర్స్ వచ్చినా ప్రజలు నమ్మొద్దని సూచించారు. గ్రేటర్‌ పరిధిలోని మూడు పోలీస్‌ కమిషనరేట్లలో 51,500 మంది పోలీసులు ఎన్నికల బందోబస్తులో పాల్గొంటారని.. ఎక్కడ ఏ ఘటన జరిగినా వెంటనే స్పందించే విధంగా టీమ్స్ సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.

Related posts