telugu navyamedia
సినిమా వార్తలు

58 సంవత్సరాల “పరమానందయ్య శిష్యుల కథ”

నటరత్న పద్మశ్రీ ఎన్.టి.రామారావు గారు నటించిన జానపద చిత్రం శ్రీదేవి ప్రొడక్షన్స్ వారి “పరమానందయ్య శిష్యుల కథ” సినిమా 07-04-1966 విడుదలయ్యింది.

నిర్మాత తోట సుబ్బారావు గారు శ్రీదేవి ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ దర్శకులు సి.పుల్లయ్య గారి దర్శకత్వంలో ఈచిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రాన్నికి కథ, మాటలు: సదాశివ బ్రహ్మం, పాటలు: సి.నారాయణ రెడ్డి, సదాశివ బ్రహ్మం, కోసరాజు, శ్రీ శ్రీ, సముద్రాల, సంగీతం: ఘంటసాల, ఫోటోగ్రఫీ: కె. నాగేశ్వరరావు, కళ: వాలి, నృత్యం: వెంపటి సత్యం, కూర్పు: బి.గోపాలరావు అందించారు.

ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, కె.ఆర్.విజయ, నాగయ్య, పద్మనాభం, అల్లురామలింగయ్య, ఎల్.విజయలక్ష్మి, ముక్కామల, రాజబాబు, ఛాయాదేవి, శోభన్ బాబు, సత్యనారాయణ తదితరులు నటించారు.

బాగా ప్రాచుర్యంలో ఉన్న ఈ కథను దర్శకుడు సి.పుల్లయ్య గారు హాస్య రసం తో పాటు భక్తి, శృంగార రసాన్ని సమపాళ్లలో మేళవించి ఈ సినిమాను ప్రేక్షకులు ఆస్వాదించే రీతిలో తీర్చిదిద్దారు.

మధుర గాయకులు, సంగీత దర్శకులు ఘంటసాల గారి సంగీత సారధ్యంలో వెలువడిన పాటలు హిట్ అయ్యాయి.
“పరమగురుడు చెప్పిన వాడు పెద్దమనిషి కాడు రా”
“నాలోని రాగమీవే నడయాడు తీగనీవే”
“ఇదిగో ఇదిగో వచ్చితి రతి రాజా”
వంటి పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.

వినసొంపైన పాటలతో సంగీతం, నృత్యం, హాస్యం ప్రధాన ఇతివృత్తంగా నడిచిన ఈ చిత్రం ఘన విజయం సాధించి విడుదలైన అన్ని కేంద్రాలలో 50 రోజులు, డైరెక్ట్ గా 15 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడి శతదినోత్సవాలు జరుపుకున్నది.

విజయవాడ మరికొన్ని కేంద్రాలలో 125 రోజులు వరకు డైరెక్ట్ గా ఆడి ఆ పిదప షిఫ్ట్ మీద సిల్వర్ జూబ్లీ ఆడి
రజతోత్సవం జరుపుకున్నది.

Related posts