telugu navyamedia
తెలంగాణ వార్తలు

1998 డీఎస్సీ అవ‌క‌త‌వ‌క‌ల‌పై ఇవాళ విచార‌ణ‌..

హైద‌రాబాద్‌…1998 డీఎస్సీ ఖమ్మం జిల్లాలో జ‌రిగిన అవకతవకలు, అక్రమాలపై తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయంలో విచారణ ఈనెల 16న జరుగనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి పెనుబల్లి మండలానికి చెందిన దావా వెంకటేశ్వర్ రావు ఫిర్యాదుతో ఈ విచార‌ణ జ‌రుగుతోంది.

1998 డీఎస్సీ రాత పరీక్ష, ఇంటర్వ్యూలో జరిగిన అనేక అవినీతి అక్రమాలు, అవకతవకలను నిగ్గు తేల్చేందుకు ప్రతీ క్వాలిఫైడ్ కూడా సమాచార హక్కు చట్టం కింద ఖమ్మం జిల్లా D.E.O కు దరఖాస్తు చేసి దొడ్డిదారిన ఉద్యోగాలు పొందిన వారి గుట్టురట్టు చేయాలని…జిల్లా విద్యా శాఖ కార్యాలయం నుంచి అధికారిక సమాచారం రాబట్టాలని 1998 D.S.C సాధన సమితి పిలుపు ఇచ్చింది. ఈ పిలుపు మేరకు డీఎస్సీ 98 లో ఉద్యోగాలు సాధించిన అక్రమార్కుల సమాచారం కోసం ఖమ్మం జిల్లా D.E.Oకి దరఖాస్తు పెట్టుకున్నారు.

అయితే, 2020 ఆగ‌స్టు 26న ఖమ్మం జిల్లా D.E.O తరపున The Public Information Officer ఇచ్చిన సమాచారం అనుమానాస్ప‌దంగా, అసమగ్రంగా ఉంద‌నే అనుమానంతో దావా వెంకటేశ్వర్ రావు తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు నేపథ్యంలో తెలంగాణ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ 2021 న‌వంబ‌ర్ 10 వ తేదీన ఫిర్యాదుదారు దావా వెంకటేశ్వర్ రావుని, ఖమ్మం జిల్లా D.E.O కార్యాలయం సంబంధిత అధికారులను నాంపల్లిలోని T.S.i.C రాష్ట్ర కార్యాలయానికి.పిలిపించి విచారణ జరిపారు. అవినీతి అక్రమాలు, అవకతవకల‌పై ఆధారాలు సేకరించారు.

ఇందులో భాగంగా ఇవాళ మరో విడత సమగ్ర విచారణ జ‌ర‌పనున్నారు. ఈ విచార‌ణ‌లో పీఐఓ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గుణ‌శీల‌, అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌ ఖ‌మ్మం డీఈవో ఆఫీస్‌ ఎం వెంక‌టేశ్వ‌ర‌చారి, ఖ‌మ్మం డీఈవో ఎస్ యాద‌య్య‌, డైరెక్ట‌ర్ ఆఫ్ స్కూల్స్ పి. మ‌ద‌న్‌మోహ‌న్ పాల్గొన‌నున్నారు.

Related posts