ఆంధ్రప్రదేశ్‌లో సీపీఎస్ రద్దుపై ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేసింది.
సీఎస్‌తో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సభ్యులుగా ఉన్నారు.
వీళ్లే ఉద్యోగ సంఘాలతో చర్చించి సీపీఎస్ రద్దు అంశంపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
సీపీఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ తో ఇవాళ యూటీఎఫ్ సీఎం ఇంటిని ముట్టడించాలని పిలుపునిచ్చింది. అయితే యూటీఎఫ్ కార్యాలయంతో పాటు సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
సీపీఎస్ రద్దు అంశానికి సంబంధించి సోమవారం నాడు సాయంత్రం సచివాలయంలో ఉద్యోగుల సంఘం నేతలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ చర్చలు జరుపుతున్న సమయంలోనే సీపీఎస్ రద్దు అంశానికి సంబంధించి ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు కమిటీని ప్రభుత్వం ప్రకటించింది.