telugu navyamedia
ఆంధ్ర వార్తలు

రష్యాలో మంచు నల్లగా కురుస్తుంది!

black snow in rusia

రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఓ పట్టణంలో మాత్రం మంచు నల్లగా కురుస్తుంది. ఓంసుచన్ అనే పట్టణంలో కురిసే మంచు ఎవరినైనా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక్కడి నల్లటి మంచుకు బలమైన కారణమే ఉంది.

మంచు తెల్లగా ఉంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఓంసుచన్ పట్టణంలో థర్మల్ ఆధారిత వేడి నీళ్ల ప్లాంట్ ఉంది. సైబీరియా ప్రాంతంలో గడ్డకట్టించే చలి ఉంటుంది. అందుకే ఈ ప్లాంట్ ద్వారా 4 వేల మందికి వేడి నీరు సరఫరా చేస్తారు. దీనికి బొగ్గు ఇంధనంగా వాడతారు. దాంతో ఈ ప్రాంతంలో కాలుష్యం తీవ్రస్థాయిలో ఉంటుంది. ప్లాంట్ నుంచి వెలువడే మసి మంచును సైతం నల్లగా మార్చేస్తోంది.

ఇక్కడ కురిసే మంచు అడుగుల మేర పేరుకుపోతుంది. ఈ నల్ల మంచుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తుంటాయి.

Related posts