telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ట్రెజరీ ఉద్యోగులకు మెమోలు జారీ చేసిన‌ ఏపీ ప్రభుత్వం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌వేశ‌పెట్టిన పీఆర్సీ జీవోల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని ఉద్యోగ‌సంఘాల నేత‌లు ఆందోళ‌న చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జీతాలు, పెన్షన్ బిల్లులు ప్రాసెస్ చేయాలంటూ ట్రెజరీ ఉద్యోగులకు మ‌రోసారి ఆదేశించింది.

అయితే కొందరు ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరించడం లేదు. ఈ మేర‌కు వారికి మోమోలు జారీ చేసింది. అయితే బిల్లులు ప్రాసెస్ చేయ‌క‌పోతే పూర్తి చేయాలని , లేనిపక్షంలో క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది.

2022 జనవరి 29 తేదీ సాయంత్రం 6 గంటల వరకు తమ విధుల్లో విఫలమైన వారిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది..

కొత్త పీఆర్‌సీ ప్రకారం జీతాల బిల్లులు సిద్ధం చేయాలని చెప్పినా నిర్లక్ష్యం చేయడం సీసీఏ రూల్స్‌కు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ మేరకు సీసీఏ రూల్స్‌ ఉల్లంఘించిన వారిపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల జీతాల చెల్లింపు ప్రక్రియను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చేపట్టాలని ఆదేశాలు ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ జారీ చేశారు.

Related posts