telugu navyamedia
సినిమా వార్తలు

బెడిసికొట్టిన ప్రియదర్శి, సందీప్ ప్రమోషన్ డ్రామా

Priyadarshi

త‌న‌దైన కామెడీ టైమింగ్‌తో క‌మెడియ‌న్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంటున్నాడు నటుడు ప్రియ‌ద‌ర్శి. ఇటీవలే చింత‌కింది మ‌ల్లేశం బ‌యోపిక్ “మ‌ల్లేశం” చిత్రంలో హీరోగా నటించి మంచి మార్కులు కొట్టేశాడు. అయితే తాజాగా స్నేహితుడి సినిమా ప్రమోషన్ కోసం ప్రియదర్శి చేసిన ఓ పని బెడిసికొట్టింది. విష‌య‌మేమంటే నిన్న ప్రియ‌ద‌ర్శి త‌న ట్విట్ట‌ర్‌లో ఎవ‌రో అన్‌ఫ్రొఫెష‌న‌ల్ దొంగ త‌న బైక్‌ను కొట్టేశాడంటూ వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో మీడియా అస‌లు ప్రియ‌ద‌ర్శి బైక్ కొట్టేసిన దొంగ ఎవ‌రా? అంటూ త‌మ‌దైన రీతిలో ఆరాలు తీయ‌డం, హైద‌రాబాద్ సిటీ పోలీసులు ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ లొకేష‌న్ ఎక్క‌డో చెప్ప‌మ‌ని అడగడంతో తో వ్య‌వ‌హారం సీరియ‌స్‌గా మారింది. దీంతో వెంటనే వెంట‌నే తాను పోస్ట్ చేసిన వీడియో డిలీట్ చేశాడు ప్రియదర్శి. హీరో సందీప్ కిష‌న్ కూడా వెంట‌నే రియాక్ట్ అయ్యి ట్విట్ట‌ర్ ద్వారా అందరికీ క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. అసలేం జరిగిందంటే… ప్రియ‌ద‌ర్శి త‌న బైక్‌ను ఎవ‌రో కొట్టేశార‌ని చెప్ప‌డం అంతా అబ‌ద్ధమ‌ట‌. ప్రియ‌ద‌ర్శి త‌న స్నేహితుడు, హీరో సందీప్ కిష‌న్ న‌టించిన “నిను వీడ‌ని నీడ‌ను నేనే” సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా త‌న బైక్ పోయింద‌ని చెప్పాడు. “నినువీడ‌ని నీడ‌ను నేనే” చిత్రంలో ఈ బైక్ క‌నిపిస్తుంది. దీన్ని ఉప‌యోగించుకుని ప్ర‌మోష‌న్స్ చేయాల‌నుకున్నారు. కానీ తీరా ఆ ప్ర‌మోషన్ బెడిసికొట్టడమే కాకుండా విమర్శల పాలైంది.

Related posts