నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరయ్యారు.
శాంతి భద్రతల విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పోలీసులంటే సమాజానికి ఒక నమ్మకం, భరోసా అని పేర్కొన్నారు.
ముందుగా పోలీసు అమరవీరుల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం, అమరవీరులకు శ్రద్ధాంజలి అర్పించి, వారి త్యాగాలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. “తెలంగాణ పోలీసులు దేశవ్యాప్తంగా శాంతి, భద్రతల పరిరక్షణలో అగ్రస్థానంలో ఉన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు ఫణంగా పెట్టాల్సి వచ్చినా మన పోలీసులు వెనక్కి తగ్గడం లేదు” అని కొనియాడారు.
959 అక్టోబర్ 21న లడాఖ్‌లో చైనా దాడిలో 10 మంది సీఆర్‌పీఎఫ్ జవానుల వీరమరణం నేపథ్యంగా ఈ దినోత్సవం పాటిస్తున్నామని సీఎం గుర్తు చేశారు.