telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

నార్త్ కరోలినాలో విజయం సాధించిన ట్రంప్…

Trump Usa

ప్రపంచం మొత్తం ఆసక్తి చూపించిన అమెరికా అధ్యక్షపదవికి సంబంధించిన తుది ఫలితాలు వెల్లడయ్యాయి.  జో బైడెన్ కి 306 ఓట్లు రాగా, ట్రంప్ కి 232 ఓట్లు లభించాయి.  నార్త్ కరోలినాలో అనూహ్యంగా ట్రంప్ విజయం సాధించారు.  నార్త్ కరోలినాలోని 15 ఓట్లు ట్రంప్ రావడంతో ఆయనకు మొత్తం 232 ఓట్లు లభించాయి.  తుది ఫలితాల తరువాత ట్రంప్ స్వరం మారిపోయింది.  అటు ఆరిజోనా ఎన్నికల ఫలితాలపై కోర్టుకు వెళ్ళాలని అనుకున్న ట్రంప్ వర్గం వెనక్కి తగ్గింది. కరోనా కంట్రోలింగ్ విషయంలో కొత్త వాళ్ళు చూసుకుంటారని ట్రంప్ చెప్పడంతో అయన మెత్తపడ్డారని తెలుస్తోంది.  అయితే, చైనా విషయంలో మాత్రం ట్రంప్ వైఖరి ఏ మాత్రం మారలేదు. కరోనా మహమ్మారి చైనా నుంచి వచ్చిందని, చైనా వైరస్ అని ట్రంప్ బాహాటంగా విమర్శలు చేశారు. వీలు దొరికినప్పుడల్లా చైనాపై నిప్పులు చెరిగారు. చైనాకు సంబంధించిన కొన్ని కంపెనీలపై ఇప్పటికే ఆంక్షలు విధించారు. ట్రంప్ అధ్యక్షుడిగా దిగిపోయేలోపుగా చైనాకు సంబంధించిన కంపెనీలపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా నిపుణులు పేర్కొన్న సంగతి తెలిసిందే. అనుకున్నట్టుగానే ట్రంప్ తాజాగా చైనాకు చెందిన 31 కంపెనీలపై ఆంక్షలు విధించారు. రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలపై ఆంక్షలు విధించే అవకాశం లేకపోలేదు. 

Related posts