తెలంగాణ ప్రభుత్వం మరోసారి కలెక్టర్లను బదిలీ చేసింది. దుబ్బాక ఎన్నిక నేపథ్యంలో గత నెలలో సిద్దిపేట నుంచి సంగారెడ్డి జిల్లాకు బదిలీ ఐన కలెక్టర్ వెంకటరామిరెడ్డిని మళ్ళీ సిద్దిపేట కలెక్టర్ గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మెడకు జిల్లా అదనపు కలెక్టర్ భాద్యతలు కూడా ఆయనకే అప్పగించింది ప్రభుత్వం. దుబ్బాక ఉప ఎన్నికకు ముందు మెదక్ జిల్లా కలెక్టర్ గా నియమితులైన సంగారెడ్డి కలెక్టర్ ఎం. హనుమంత రావును తిరిగి సంగారెడ్డికి బదిలీ చేసింది. ఇప్పటి వరకు సిద్దిపేట కలెక్టర్ గా ఉన్న మంచిర్యాల కలెక్టర్ భారతి హోలికేరిని మళ్ళీ మంచిర్యాల కు పంపించింది. ఆ జిల్లా కలెక్టర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సిక్తా పట్నాయక్ ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది ప్రభుత్వం. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న శశాంక్ కు ఆ బాధ్యతల నుంచి విముక్తి కల్పిస్తూ ఆ స్థానంలో హోలికేరికి అదనపు బాధ్యతలు బాధ్యతలు అప్పగించింది. మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు బదిలీ కాగా.. హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతికి మల్కాజిగిరి జిల్లా అదనపు బాధ్యతలు అప్పగించారు.
previous post
ప్రభుత్వం తనను వేధిస్తోందని కోడెల ఆవేదన చెందేవారు: సుజనా చౌదరి