గత కొద్ది రోజులుగా ఒక అమెరికన్ చాల అనర్గళంగా తెలుగులో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వ్యక్తి పేరు రిచర్డ్ ఇసాక్ వాస్తవానికి అతడు న్యూజిలాండ్ వ్యక్తి అయినప్పటికీ అతడు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. 2016 ప్రాంతంలో రెండు సంవత్సరాల పాటు అతడు ఆంధ్రప్రదేశ్ లో ఉండటంతో తెలుగు బాగా ఇష్టపడి తాను నేర్చుకున్నాను అని చెపుతున్నాడు. ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్ ప్రాంతంలో ఒక ఐస్ క్రీమ్ పార్లర్ లో పనిచేస్తూ అక్కడి తెలుగు వారితో అనర్గళంగా మాట్లాడుతున్న అతడి మాటలను ఒక వ్యక్తి రికార్డ్ చేసి మంచు లక్ష్మికి షేర్ చేసాడట. ఆ వీడియో చూసి ఆమె షాక్ అవ్వడమే కాకుండా అతడి ముందు తాను తలదించుకున్నాను అంటూ కామెంట్ చేసింది. తాను ఆంధ్రప్రదేశ్ లో పుట్టి పెరిగినా… అంత స్పష్టంగా తాను తెలుగు మాట్లాడలేనని అయితే ఆ అమెరికన్ కు తెలుగు భాష పై ఉన్న ముక్కువలో తనకు సగం కూడ లేకపోవడం తనకు అవమానంగా మారింది అంటూ కామెంట్ చేసింది. అంతేకాదు అనర్గళంగా డైలాగ్స్ చెప్పే మోహన్ బాబు కూతురుగా తాను పుట్టినా ఆ అమెరికన్ కు ఉన్న తెలుగు భాష పై ఉన్న ప్రేమలో తనకు పదవవంతు కూడ లేకపోవడం తన నిర్లక్ష్యంగా భావిస్తున్నాను అంటూ తన పై తానే షాకింగ్ కామెంట్స్ చేసుకుంది మంచు లక్ష్మి.
previous post