telugu navyamedia
వార్తలు సాంకేతిక సామాజిక

రాజేంద్రనగర్ కొండపై ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎండీ అలైన్ మెంట్‌ పరిశీలన

హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో ఎండి శ్రీ ఎన్వీఎస్ రెడ్డి తన సీనియర్ ఇంజనీర్లతో కలిసి బుధవారం రాజేంద్రనగర్ కొండపై సుమారు 1.3 కి.మీ పొడవుగల విమానాశ్రయ మెట్రో అలైన్‌మెంట్‌ను పరిశీలించారు. నిటారుగా ఉండే ఎత్తులు, బండరాళ్లు మరియు లోయలు ఉన్న ఈ కొండపై విమానాశ్రయ మెట్రో వయాడక్ట్ నిర్మాణం చాలా కష్టమైన పని. నిటారుగా ఉన్న వాలులు, బండరాళ్లను అధిరోహిస్తూ, శ్రీ ఎన్వీఎస్ రెడ్డి ప్రతిపాదిత ఎలైన్మెంటును పరిశీలించి, ఈ క్రింది నిర్ణయాలను తీసుకొన్నారు:

మెట్రో అలైన్‌మెంట్ మరియు ORR క్రాష్ బారియర్ మధ్య గ్యాప్ దాదాపు 18 అడుగులు మాత్రమే ఉండి, ORR లోతైన కటింగ్ లో ఉన్నందున, ORR వైపు ఎటువంటి బండరాళ్లు పడకుండా తగిన బలం మరియు ఎత్తుతో కూడిన రక్షణ బ్యారియర్లను అమర్చాలి;
* బౌల్డర్ స్టెబిలైజేషన్ పధ్ధతులను నిపుణులతో సంప్రదించి అవలంబించాలి;
* ఏదైనా సంఘ విద్రోహ కార్యకలాపాల నుండి మెట్రో వయాడక్ట్‌ను రక్షించడానికి విమానాశ్రయం మెట్రో కు ఎడమ వైపున రక్షిత ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయాలి;
* ఆక్రమణలను నిరోధించడానికి ప్రక్కనే ఉన్న ప్రైవేట్ ఆస్తుల నుండి విమానాశ్రయ మెట్రో ప్రాంతాన్ని ఆక్రమణలు లేకుండా HMDAతో సంప్రదించి సరిహద్దు సర్వే రాళ్లను ఏర్పాటు చేయాలి;
* రాతిని తొలగించే అవసరం నివారించడానికై, స్టబ్‌లు లేదా తక్కువ ఎత్తు ఉన్న స్తంభాలపై మెట్రో వయాడక్ట్‌ను నిర్మించే అవకాశం పరిశీలించాలి;
* ORR డ్రైనేజీ వ్యవస్థలోకి వర్షపు నీరు ప్రవహించేలా కొండపై HAML నిర్మించిన తాత్కాలిక రహదారి లోయ పాయింట్ల వద్ద తగినంత వ్యాసార్థంతో కూడిన హ్యూమ్ పైపులతో క్రాస్ డ్రెయిన్‌లు ఏర్పాటు చేయాలి; మరియు
* కొండపై దాదాపు 300 మీటర్ల వరకు మిగిలిన విస్తీర్ణంలో తాత్కాలిక రహదారిని ఏర్పాటు చేయడాన్ని రాబోయే కొద్ది రోజుల్లో పూర్తి చేయాలి.
ఎయిర్ పోర్ట్ మెట్రో చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ బి. ఆనంద్ మోహన్, జి.యం. శ్రీ యం. విష్ణువర్ధన్ రెడ్డి, యస్ .ఇ. శ్రీ వై సాయప రెడ్డి, డెప్యూటీ చీఫ్ ఇంజనీర్ (రైల్వే) శ్రీ జెయన్ గుప్తా మరియు ఇతర సీనియర్ అధికారులు తనిఖీలో పాల్గొన్నారు.

Related posts