“పుష్ప ది రైజ్” మూవీ సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్ళి , అక్కడ హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప ది రైజ్” మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ లో “పుష్ప ది రైజ్” మూవీ డబ్బింగ్ వెర్షన్ కలెక్షన్స్ 100 కోట్ల దిశగా దూసుకుపోవడం విశేషం. హీరో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఇప్పటికే ఈ చిత్రం పై పలువురు ప్రముఖులు, సినీ పరిశ్రమ కి చెందిన వారు ప్రశంసల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే.
దుబాయ్ స్కైలైన్ వ్యూని ఎంజాయ్ చేస్తున్న తన ఫొటో ను అల్లు అర్జున్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆ స్టైలిష్ ఫొటో అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది. దుబాయ్ నుంచి రాగానే ‘పుష్ప–2’ చిత్రీకరణతో పాల్గొనే అవకాశం ఉంది. ఫిబ్రవరి నెలలో “పుష్ప “సెకండ్ పార్ట్”పుష్ప :ది రూల్ ” మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.
ఏపీ మెజారిటీ ప్రజలు రోడ్ల మీదకు వస్తే హైదరాబాద్ పరిస్థితేంటి: శివాజీ