విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్‌గా నటించిన సినిమా లైగర్. డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో స్పోర్ట్స్ యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో రమ్యకృష్ణ విజయ్ తల్లి పాత్రలో నటిస్తోంది.
అలాగే మైక్ టైసన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి.
ఇక రేపు ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా లైగర్ మూవీ విడుదల కానుంది. పాన్ ఇండియా స్థాయికి తగినట్లే ప్రచారం కూడా చేయడంతో ‘లైగర్’గురించి దేశవ్యాప్తంగా టాక్.
ఈ చిత్రంపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. లైగర్ పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. తాజాగా స్టార్ హిరోయిన్ అనుష్క శెట్టి సోషల్ మీడియా వేదికగా ‘లైగర్’టీమ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పింది.
విజయ్ కూడా అనుష్క పోస్ట్‌పై స్పందించాడు.‘ థ్యాంక్యూ సోమచ్ స్వీటీ.. అర్జున్ రెడ్డి సినిమా విడుదలైనప్పుడు కూడా విషెస్ చెప్పారు. ఆ సినిమాలాగే లైగర్ కూడా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను’ అని విజయ్ రిప్లై ఇచ్చాడు. అయితే అనుష్క తన పోస్ట్‌లో పూరి జగన్నాథ్ ‘జగ్గుదాదా’ అని సంబోధించడం విశేషం.