telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

ప్రియుడి కోసం పోలీస్ స్టేషన్ లో యువతి హల్‌చల్

police station bachupally

బాచుపల్లి పోలీసు స్టేషన్ లో ఓ యువతి హల్‌చల్ చేసింది. మణికొండ సమీపంలోని చిత్రపురి కాలనీకి చెందిన యశ్విత అనే యువతి ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది. ఈమె గత కొంతకాలంగా ఒక అబ్బాయిని ప్రేమిస్తోంది. అతని పేరు చెరుకూరి చందు, నివాసం బాచుపల్లి. బాచుపల్లి రాజీవ్‌గాంధీనగర్‌లో నివాసముండే ప్రియుడి ఇంటికి బుధవారం రాత్రి ఆ యువతి వచ్చింది. ఆ సమయంలో అతడి తల్లిదండ్రులు మాత్రమే ఇంట్లో ఉండటంతో నానా హంగామా చేసింది. అతడితో వెంటనే తనకు పెళ్లి జరిపించాలని డిమాండ్ చేసింది. దీంతో వారు బాచుపల్లి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు యశ్వితను, అబ్బాయి తల్లితండ్రులను పోలీసు స్టేషన్ కు తీసుకువచ్చారు. తర్వాత పోలీసులు ఎంత నచ్చజెప్పినా సదరు యువతి వినిపించుకోకుండా పెద్దగా అరుస్తూ.. ఆ అబ్బాయితో తనకు వివాహం జరిపించాలని గొడవ చేసింది. పోలీసు స్టేషన్ లో ఉన్న వస్తువులను కింద పడేస్తూ నానా హంగామా చేసింది. ఆ అబ్బాయిని వెంటనే పిలిపించి తనతో వివాహం జరిపించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగింది.వస్తువులను కింద పడేయడంతో పాటు గోడను తలకేసి కొట్టుకుంది.చివరకు పోలీసులు పెళ్లి చేయిస్తామని హామీ ఇవ్వడంతో శాంతించింది. యువతిపై కేసు నమోదు చేసి పోలీసులు ఆమెను కుటుంబసభ్యులకు అప్పగించారు.

Related posts