బీజేపీ (భారతీయ జనతాపార్టీ జాతీయ) అధ్యక్షుడు అమిత్‌షా నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. నిజామాబాద్‌లో జరగనున్న ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాల శక్తి కేంద్రాల ఇన్‌చార్జిలు, బూత్ ఇన్‌చార్జిలు, పదాధికారులతో సమావేశం కానున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అమిత్‌షా బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నిజామాబాద్ వెళ్తారు. అక్కడ జరిగే నిజామాబాద్, ఆదిలాబాద్, జహీరాబాద్, మెదక్, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ క్లస్టర్ స్థాయి సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు.