telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

నైట్ పార్టీలో అందరి ముందూ ప్యాంటు విప్పాడని… ఫ్రెండ్ ను పొడిచేసి వ్యక్తి

Crime

బ్రిటన్‌కు చెందిన పాల్ లండీ అనే వ్యక్తి ఓ ఎక్స్‌ట్రావర్ట్. తన వద్ద ఉన్న ప్రతి దాన్నీ అందరికీ గొప్పగా చూపించుకోవాలని అతని తాపత్రయం. ఈ అలవాటులోనే ఎప్పుడైనా నైట్‌ పార్టీలకు వెళ్తే.. కామెడీగా ఉంటుందని ప్యాంటు విప్పి అందరి ముందూ గంతులేసేవాడు. తన మర్మాంగం గురించి గొప్పలు చెప్పేవాడు. ఇలానే ఓ పార్టీలో చేస్తూ నాథన్ కాల్డర్ (28) అనే మిత్రుడిని ఆటపట్టించాడు. అంతే ఆగ్రహంతో ఊగిపోయిన నాథన్.. పక్కనే ఉన్న కత్తి తీసుకొని పాల్‌ను కసితీరా పొడిచి చంపేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నాథన్‌ను అరెస్టు చేశారు. ప్యాంటు విప్పి తనపై పడుతూ పాల్ అదోమాదిరి ప్రవర్తించాడని, దాంతో తనకు భయం వేసిందని నాథన్ చెప్పాడు. ఆ భయంలోనే తాను ఈ హత్య చేసినట్లు పేర్కొన్నాడు. అయితే పాల్ పరిచయస్థులెవరూ దీనికి అంగీకరించలేదు. కొంచెం మందు ఎక్కువైతే పాల్ ఎప్పుడూ అలానే ప్రవర్తిస్తాడని, నాథన్‌కు కూడా ఆ విషయం తెలుసని వారు చెప్పారు. ఈ కేసుపై విచారణ జరిపిన వార్సెస్టర్ క్రౌన్ కోర్టు.. నాథన్ కావాలనే పాల్‌ను హత్య చేసినట్లు నిర్ధారించింది. అతనికి జీవితఖైదు విధిస్తూ గురువారం తీర్పిచ్చింది.

Related posts