telugu navyamedia
andhra news political

చంద్రబాబు అండ్ కో బాగుపడ్డారు: కొడాలి నాని

kodali nani ycp

అమరావతి రాజధాని వ్యవహారంలో చంద్రబాబు అండ్ కో బాగుపడ్డారని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. అమరావతిలో రాజధాని వస్తుందని అక్కడ భూములు కోనుగోలు చేసుకోవాలని టీడీపీ  నాయకులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ముందే చెప్పారని అన్నారు.

రాజధానిలో రైతులను మోసం చేసి టీడీపీ నాయకులు ఎకరం భూమి 25లక్షలకు కొనుగోలు చేసి కోట్లాది రూపాయలకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని లాభం పొందారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో పతిపక్షంలో ఉన్నప్పటి నుంచి రాజధాని వ్యవహారంలో కుంభకోణం జరిగిందని చెబుతున్నారన్నారు.

గత మార్చిలోనే అమరావతి భూ కుంభకోణం మీద సీబీఐ విచారణకు అదేశించాలని కేబినెట్ అమోదంతో కేంద్ర ప్రభుత్వాన్ని కోరాటం జరిగిందని కొడాలి నాని పేర్కొన్నారు.చంద్రబాబుజీవితం అంతా ప్రజలకు తెలుసని కొడాలి నాని పేర్కొన్నారు.

Related posts

కరోనాను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతల అక్రమాలు: యనమల

vimala p

మారుతీరావుకు రూ.200 కోట్ల ఆస్తులు!

vimala p

ఏపీ కొత్త గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణ స్వీకారం

vimala p