telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత జట్టుకు ఫైన్…

more security to indian team as threaten call

సిడ్నీలో భారత్-ఆసీస్ ల మధ్య నిన్న జరిగిన మొదటి వన్డేలో ఆస్ట్రేలియాతో 66 పరుగుల తేడాతో భారత జట్టు ఓడిపోయింది. అయితే అదే సమయంలో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించారు. భారత జట్టు నిర్ణిత సమయం కంటే ఒక ఓవర్ ఆలస్యంగా వేసిన కారణంగా ఈ ఫైన్ విధించారు. అయితే విరాట్ కోహ్లీ ఈ తప్పును అంగీకరించాడు. కాబట్టి అధికారిక విచారణ అవసరం లేదని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్ (69), ఆరోన్ ఫించ్ (114), స్మిత్ (105) పరుగులతో రెచ్చిపోవడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది. కానీ భారత జట్టులో ఆ తర్వాత ధావన్ (74), హార్దిక్ (90) రాణించిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది.. ఈ విజయంతో మూడు మ్యాచ్ ల ఈ వన్డే సిరీస్ లో ఆసీస్ 0-1 తో ఆధిక్యంలోకి వెళ్ళింది. ఇక రెండో మ్యాచ్ ఈ నెల 29న జరగనుంది. ఈ మ్యాచ్ లో ఆసీస్ విజయం సాధిస్తే సిరీస్ ఆసీస్ సొంతం అవుతుంది.

Related posts