telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఎమ్మెల్సీ పదవులకు .. అభ్యర్థులను సిద్ధం చేసిన వైసీపీ..

ycp party

ఏపీలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవుల భర్తీకి ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక వచ్చిన తొలి ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో మూడు ఎమ్మెల్సీ లు ఎవరికి దక్కుతాయనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ప్రస్తుతం వైసీపీకి 151మంది ఎమ్మెల్యేల మద్దతుంది. పైగా అధికారంలో ఉంది. కొండంత ప్రజాబలం ఉంది. దీంతో ఆ మూడు ఎమ్మెల్సీ పదవులు వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి తెలిసిపోతూనే ఉంది. మరి ఈ మూడు స్థానాలను జగన్ ఎవరికి ఇస్తారనేది ప్రస్తుతం వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది.

రేపల్లెలో ఓడినా మంత్రి పదవి చేపట్టిన మోపిదేవికి ఒక ఎమ్మెల్సీ సీటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. బాలయ్యపై ఓడిన మైనార్టీ నేత ఇక్బాల్ కు ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ వాగ్ధానం చేశారు. వైసీపీలో చేరిన మాజీ ఎంపీ రవీంద్ర బాబు, రాజంపేట సీటు త్యాగం చేసిన మేకపాటి అమర్నాథ్ రెడ్డిలకు మిగతా రెండు సీట్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ నిర్ణయమే అంతిమంగా ఫైనల్ కానుంది. టీడీపీ నుంచి చీరాల ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్సీ కరణం బలరాం, వైసీపీ నుంచి ఏలూరు ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల నాని, విజయనగరం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కొలగొట్ల వీరభద్రస్వామి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ మూడు స్థానాలను ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేయనున్నారు.

Related posts