telugu navyamedia
telugu cinema news

తెలుగులో రాబోతున్న అజిత్ “విశ్వాసం”

visvasam movie trailer
అగ్ర కథానాయకుడు అజిత్‌ నటించిన “విశ్వాసం” చిత్రం ఈ నెల 10న సంక్రాంతి కానుకగా తమిళనాట విడుదలై సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో అజిత్ సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. జగపతిబాబు, సత్యరాజ్‌, ప్రభు గణేశన్‌, సంపత్‌రాజ్‌, యోగిబాబు, వివేక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శివ దర్శకత్వం వహించారు. సత్యజ్యోతి ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇమాన్‌ బాణీలు సమకూర్చారు. తెలుగులో కూడా ఈ సినిమాను సంక్రాంతికే విడుదల చేయాలని భావించారు. కానీ ఇక్కడ సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలతో పోటీ ఎక్కువగా ఉండడంతో వెనకడుగు వేశారు. ప్రస్తుతం ఈ సినిమాను ఫిబ్రవరి 1న విడుదల చేయాలనుకుంటున్నారనేది తాజా సమాచారం. మరి తెలుగులో ఈ సినిమా ఏ రేంజ్ లో ఆడుతుందో చూడాలి. 

Related posts

బిగ్‌బాస్-3 తొలి ప్రోమో

vimala p

మా ఊరికి వెళ్లిపోతున్నా… శివాజీరాజా సంచలన వ్యాఖ్యలు

vimala p

బ్లాక్ కలర్ బికినీలో సమంత… “ఐ లవ్యూ 3000”

vimala p