telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ ఖాతాలో మరో రికార్డు…

టాలీవుడ్ లో పెళ్లి చూపులు చిత్రం తో హీరోగా మారి, అర్జున్ రెడ్డి చిత్రం తో యువత హృదయాలను కొల్లగొట్టాడు విజయదేవరకొండ. రాత్రికి రాత్రే విజయ్ కి ఎంతో పేరు తెచ్చి పెట్టింది ఈ సినిమా ఆ తరువాత వచ్చిన గీతా గోవిందం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే.. ఆ తరువాత వచ్చిన నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫెమస్ లవర్ చిత్రాలు ఊహించిన స్థాయిలో ఆడలేదు. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ కి సోషల్ మీడియా లో వున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. తాజాగా ఈ రౌడీ హీరో ఇంస్టాగ్రామ్ లో విజయ్ 11 మిలియన్ మార్క్ ను దాటాడు. సౌత్ ఇండియా మొత్తంలో 11 మిలియన్ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న ఏకైక హీరో విజయ్ దేవరకొండ. అది కూడా తను ఇంస్టాగ్రామ్ లోకి ఎంటరైన తక్కువ సమయంలో చేరుకోవడం మరో విశేషం. ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వం లో “లైగర్” అనే సినిమా చేస్తున్నాడు విజయ్. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. 

Related posts