telugu navyamedia
telugu cinema news trending

సింగిల్స్ రండి.. వాలంటైన్ వీక్ జరుపుకుందాం.. అంటున్న.. సాయి ధర్మ తేజ్

valentine single challenge by saidharmatej

ప్రేమికుల రోజు అంటే చక్కగా ప్రేమజంటలు వేడుకలు జరుపుకునే రోజు; మరి సింగిల్స్ ఉంటె ఏమి చేయాలి. దానికి సాయి ధర్మ తేజ్ ఒక చిన్న చిట్కా చెప్పాడు. అసలు సోష‌ల్ మీడియాకి ఆద‌ర‌ణ పెరుగుతున్న‌ప్ప‌టి నుండి స‌రికొత్త ఛాలెంజ్‌లు పుట్టుకొస్తున్నాయి. ఈ ఛాలెంజ్‌ల‌లో సామాన్యులే కాదు సెల‌బ్రిటీలు కూడా భాగం అవుతున్నారు. అయితే మ‌రి కొద్ది రోజుల‌లో ప్రేమికుల రోజు రానుండ‌డంతో మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌న అభిమానుల‌కి వినూత్న ఛాలెంజ్ విసిరారు. త‌న ట్విట్ట‌ర్‌లో ‘మీరూ నాలా సింగిల్‌గా ఉన్నారా.. అయితే రండి సింగిల్స్ వాలంటైన్ వీక్‌ను జరుపుకుందాం’ అంటూ పిలుపునిచ్చారు. #SDTsingleChallenge ఉపయోగించి మీ గొప్ప సింగిల్ స్టోరీలను షేర్ చేయండి .. ప్రతి సింగిల్‌కి ఒక కథ ఉంటుంది’ అంటూ ట్వీట్ చేశాడు.

దానికి క‌మెడీయ‌న్ వెన్నెల కిషోర్ ఫ‌న్నీగా స‌మాధాన‌మిచ్చాడు. మెట్రో రైలులో ఆయన పడుకొని ఉన్న ఫొటోను పెట్టి.. ‘ప్రేమ ప్రయాణంలో మీ పరిస్థితి ఇది అంటారు అయితే’ అని కామెంట్ చేశారు. దీనికి రిప్లై ఇచ్చిన తేజూ.. మీనుండి నేర్చుకున్న‌దే అన్న‌గారు అని కామెంట్ పెట్టాడు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్స్ నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటున్నాయి. సాయిధ‌ర‌మ్ ప్ర‌స్తుతం చిత్రల‌హ‌రి సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

Related posts

“కబీర్ సింగ్”తో వైద్య వృత్తి పట్ల ప్రజలకు తప్పుడు సందేశం… మహారాష్ట్ర మంత్రికి డాక్టర్ లేఖ

vimala p

రానున్న రెండు రోజులలో.. ఏపీలో తీవ్ర వడగాల్పులు.. జాగర్తగా ఉండాలన్న అధికారులు..

vimala p

ఆర్టికల్ 370 రద్దుపై లావణ్య త్రిపాఠి స్పందన

vimala p