telugu navyamedia
క్రైమ్ వార్తలు

తాను చనిపోతూ ఐదుగురికి ప్రాణభిక్ష.. ఆదర్శంగా నిలిచిన బాలిక

Tanu Chanipotu Five Members ki Prana Dhanam
ఓ 15 ఏళ్ల చిన్నారి తను చనిపోతానని ఆసుపత్రిలో వైద్యుల మాటల ద్వారా తెలుసుకొంది. నా అవయవాలను దానం చేసి పలువురికి ప్రాణభిక్ష పెట్టండి” అని కుటుంబసభ్యులకు చెప్పింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం పెనుబల్లికి చెందిన ఆవునూరి గంటల వ్యవధిలో ప్రాణం పోతుందని తెలిసీ.. భయపడకపోగా అభినయ అవయవదానంపై మాట్లాడిందంటే అది ఆమెకు తండ్రి ఇచ్చిన స్ఫూర్తే! ”నాన్నా నీ కోరిక నెరవేర్చాను. నేను చనిపోయినా ఇతరుల కళ్లతో ఈ లోకాన్ని చూస్తూనే ఉంటాను” అంటూ ప్రశాంతంగా కన్నుమూసింది.
మనం చనిపోయే ముందు మన అవయవాలను ఇతరులకు దానం చేసి మానవత్వాన్ని చాటుకోవాలి.. నిత్యం తండ్రి ఓ బాలికకు చెప్పిన ఈ మాటలు నేడు ఐదుగురి ప్రాణాలను నిలిపాయి. నిత్యం ఈ మాటలతో ఆ బాలికలో చైతన్యం నింపిన ఆ తండ్రి గత ఏడాది చనిపోగా రక్త హీనతతో బాధపడుతున్న ఆ చిన్నారి హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో బ్రెయిన్‌ డెడ్‌కు గురైంది. ఆ బాలిక కోరిక మేరకు బంధువులు అవయవ దానం చేశారు. ఆ అవయవాలతో ఐదుగురికి ప్రాణదానం చేశారు. 
చుంచుపల్లి మండలంలోని పెనుబల్లికి చెందిన ఆవునూరి శ్రీనివాసరావు, కవిత దంపతులకు కుమారుడు వెంకటవరుణ్‌, కుమార్తె ఆవునూరి అభినయ(15) ఉన్నారు. ఆర్‌ఎంపీగా పని చేస్తున్న శ్రీనివాసరావు గత ఏడాది మార్చి ఒకటో తేదీన అనారోగ్యంతో మృతి చెందాడు. తండ్రి మృతి చెందడంతో కుమార్తె అభినయ అప్పటి నుంచి మనోవేదనతో ఉంది. మూడు రోజుల క్రితం స్కూల్‌కు వెళ్లిన అభినయకు అక్కడ వాంతులయ్యాయి. దీంతో  హైదరాబాద్‌లోని మలక్‌పేట యశోధ ఆసుపత్రికి తరలించారు. 
ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు బాలిక పరిస్థితి విషమంగా ఉందని, బ్రెయిన్‌ డెడ్‌ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఈ క్రమంలో బాలిక కుటుంబ సభ్యులతో మా ట్లాడింది. తాను చనిపోతానని, తన అవయవాలు దానం చేసి పలువురికి ప్రాణాలు నిలపాలని కోరింది. పదో తరగతి చదువుతున్న కుమార్తె నోటి వెంట ఇలాంటి మాటలు వినేసరికి కుటుంబ సభ్యులు భోరున విలపించారు. చివరి కోరిక మేరకు అవయవాలు దానం చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో బ్రెయిన్‌ డెడ్‌ కాగానే గుండె, నేత్రాలు, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయం దానం చేశారు.

Related posts