telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ఒక్కో గదిలో ఇద్దరు మాత్రమే ఉండాలి: టీటీడీ ఈవో

tirumala guest house

తిరుమల శ్రీవారి దర్శనాలు త్వరలో తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అనేక అంశాలపై మీడియాకు వివరాలు తెలిపారు. ఈ నెల 8న ఆన్ లైన్ బుకింగ్ ప్రారంభం కానుందని, జూన్ నెల కోటా మొత్తం విడుదల చేస్తామని చెప్పారు. వసతి గదుల్లో ఒక్కరోజు మాత్రమే భక్తులకు అనుమతి ఉంటుందని తెలిపారు. ఒక్కో గదిలో ఇద్దరు మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. గంటకు 500 మందికి శ్రీవారి దర్శనం కల్పిస్తామని వివరించారు.

శ్రీవారి ఆలయంలోని ఉప ఆలయాల దర్శనం ఉండదని సింఘాల్ వెల్లడించారు. క్యూలైన్లలో ప్రతి 2 గంటలకు ఓసారి శానిటైజేషన్ చేస్తారని, 500 మంది సిబ్బందికి పీపీఈ కిట్లు ఇచ్చే అవకాశముందని తెలిపారు. అంతేగాకుండా, ప్రతి 2 గంటలకోసారి లడ్డూ కౌంటర్లు మార్చుతామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో ప్రైవేటు హోటళ్లకు అనుమతి ఇవ్వడంలేదని స్పష్టం చేశారు.

Related posts