తూర్పు లడఖ్‌లో భారత్-చైనా మధ్య జరిగిన ఘర్షణలో అమరులైన భారత సైనికులకు బీజేపీ ఏపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు నివాళులు అర్పించారు. అనంతరం కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. డ్రాగన్ దేశంపై నిప్పులు చెరిగారు. ఏడాది కాలంగా చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని చెప్పారు.
చైనా సైనికులతో భారత సైనికులు పోరాడిన తీరును కన్నా లక్ష్మీనారాయణ కొనియాడారు. ఈ పోరులో 20 మంది భారత సైనికులు అమరులయ్యారని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేశం మొత్తం కోరుకుంటుందని తెలిపారు.చైనా వస్తువులు కొనుగోలు చేయొద్దని, దీనిపై దేశ ప్రజలంతా ప్రమాణం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చైనాను ఆర్థికంగా దెబ్బకొట్టాలని, అప్పుడే ఆ దేశానికి బుద్ధి వస్తుందని తెలిపారు.