తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సోమవారం ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో సహస్ర చండీయాగం చేయనున్నారు. విశాఖ శారదా పీఠం అధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి వారి సమక్షంలో ఈ యాగం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ కార్యక్రమానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లను ఆహ్వానించారు. 300 మంది రుత్వికులతో జనవరి 21 వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు 5 రోజులపాటు ఎరవెల్లి వ్యవసాయ క్షేత్రంలో సహస్ర చండీయాగం జరగనున్నది.
తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి రుత్వికులు ఇప్పటికే యాగశాలకు చేరుకున్నారు.ఈ మహా క్రతువు కోసం కర్ణాటక శృంగేరి పీఠం నుంచి వేద పండితులు ఇప్పటికే చేరుకున్నారు. మాడుగుల మాణిక్య సోమయాజులు, నరేంద్ర కాపే, ఫణి శశాంక శర్మ, భద్రకాళి వేణు తదితర వేద పండితుల ఆధ్వర్యంలో యాగం నిర్వహిస్తారు. ఐదు రోజులపాటు జరగనున్న ఈ యాగంలో కేసీఆర్ దంపతులు పాల్గొంటారు.
ఎక్కడ స్కామ్ ఉంటే అక్కడ నిలుస్తావు.. పీవీపీపై బండ్ల గణేశ్ విమర్శలు