telugu navyamedia
సినిమా వార్తలు

మన్మథుడు-2 రొమాన్స్ ఎఫెక్ట్ చిన్మయిపై…

Chinmayi-Sripada

సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న చిన్మయి మీటూ ఆరోపణలతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అయితే చిన్మయి ఈ ఏడాది జనవరిలో ”వయసు మళ్లిన హీరోలు తమ సినిమాలలో కూతురు వయసుండే హీరోయిన్లతో రొమాన్స్ చేయడం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంది. ఇది ఇంకా ఆగలేదు.. ఆగిందా..?” అంటూ ఓ పోస్ట్ పెట్టింది. అంతవరకు ఓకే… కానీ ఇప్పుడు చిన్మయి తన భర్త రాహుల్ రవీంద్రన్ రూపొందించిన “మన్మథుడు-2” చిత్రాన్ని ప్రమోట్ చేస్తోంది. ఇందులో హీరోగా నటించిన నాగార్జున వయసు 59, తన వయసులో సగం కంటే తక్కువ ఉన్న హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నారు. దీంతో నెటిజన్లు చిన్మయిని టార్గెట్ చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం అప్పట్లో పోస్ట్ లు పెట్టి ఇప్పుడు తన భర్త అలాంటి పనులు చేస్తుంటే ప్రోత్సహిస్తుందని ఆమెని ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి చీప్ పబ్లిసిటీ కోసం వెంపర్లాడడం సిగ్గుగా లేదా..? అంటూ ఓ రేంజ్ లో చిన్మయిపై మండిపడుతున్నారు.

Related posts