telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు సామాజిక

రాశిఫలాలు : … అదృష్టం కలిసి వచ్చే రోజు… అందిపుచ్చుకోవాలి..

today rasi falalu

మేషం : ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. వారు ముఖ్యంగా కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. అలాగే పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. శివారాధన చేయటం మంచిది.

వృషభం : ఆహ్లాదకరమైన రోజు. ఇష్టమైనా వారితో గడుపుతారు. బంధుమిత్రుల సమాగమం. వివాహాది శుభకార్యాల్లో పాల్గొనడం అలాగే పాత మిత్రులను కలువడం జరుగుతుంది. సమయానికి డబ్బు అందడం వలన ఆర్థిక సంబంధ సమస్య తొలిగిపోతుంది. మీ జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్థలు తొలిగిపోతాయి.

మిథునం : ఈ రోజు అనుకున్న పనులు తక్కువ శ్రమతో పూర్తి అవుతాయి. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న విషయంలో శుభవార్త వింటారు. మీ లక్ష్యం నెరవేరుతుంది. ధనలాభం కలుగుతుంది అలాగే రుచికరమైన భోజనం చేస్తారు. మీ స్నేహితులను కలుసుకుంటారు.

కర్కాటకం : ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు వచ్చే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా మానసిక ప్రశాంతత ఉండదు. అలసట, నీరసం అధికంగా ఉంటాయి.. మీ సంతానం గురించి కానీ, ఏదైనా పోటీ విషయంగా కానీ డబ్బు ఖర్చవుతుంది. చేపట్టిన పనులు చిన్న చిన్న అడ్డంకులతో పూర్తవుతాయి.

సింహం : ఈ రోజు మీ సహోద్యోగులతో, పైఅధికారులతో సామరస్యంగా వ్యవహరించడం మంచిది. మీ అజాగ్రత్త కారణంగా వారి కోపానికి గురయ్యే అవకాశమున్నది. వారితో వాదనకు దిగకండి. మాట విషయంలో జాగ్రత్త అవసరం.

కన్య : మీ జీవిత భాగస్వామితో, పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారితో కలిసి వినోద యాత్ర చేసే అవకాశముంది. ఖర్చు అధికంగా ఉంటుంది. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు.

తుల : మీరు అనుకున్న పనులు పూర్తి చేయడానికి, కొత్త పనులు ప్రారంభించటానికి అనుకూలమైన రోజు. అలాగే చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు.

వృశ్చికం : ఆర్థికంగా కొంత ఇబ్బందిని కలిగించే రోజు. ధన నష్టం కానీ, అనవసరమైన ఖర్చు కానీ ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు. ఎవరికి కూడా డబ్బు విషయంలో మాట ఇచ్చి ఇబ్బంది పడకండి. ఆర్థిక నియంత్రణ అవసరం.

ధనుస్సు : ఆరోగ్యం విషయంలో ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. కడుపు నొప్పి కానీ, ఛాతిలో మంటతో కానీ బాధపడే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బయటి భోజనం చేయకండి. అలాగే మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉన్నది.

మకరం : ఈ రోజు ఆర్థికంగా కలిసి వస్తుంది. పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. అలాగే మొండి బకాయిలు వసూలవుతాయి. భూ సంబంధ లావాదేవీలు చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు అందుతాయి.

కుంభం : మీరు చేపట్టే పనుల్లో అవరోధాలు ఏర్పడుతాయి. ముఖ్యంగా మీ కార్యాలయంలో మీరు చేయాలనుకున్న పనికి సహోద్యోగుల నుంచి వ్యతిరేకత రావచ్చు. ఆవేశానికి లోను కాకుండా సామరస్య పూర్వకంగా వ్యవహరించండి. శారీరక, మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. విశ్రాంతి అవసరం.

మీనం : అదృష్టం కలిసి వచ్చే రోజు. మీరు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. మీ తోటి వారి నుంచి కానీ, సహోద్యోగుల నుంచి కానీ ప్రశంసలు అందుకుంటారు. మధ్యవర్తిత్వాలు లేదా చర్చలు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి. బంధువులను
కలుసుకుంటారు.

Related posts