telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

ఇలా కూడా .. కండల వీరులు అవొచ్చట.. ! భలే ఆలోచన అనుకుంటే.. అంతే..!!

man trying for arnald kind body fitness

అంతర్జాతీయం మీడియా దృష్టిని జిల్ కు చెందిన వాల్దిర్ సెగాటో ఆకర్షిస్తున్నాడు. సెగాటో ఓ బాడీబిల్డర్. అయితే, పెంచిన కండల పట్ల అతడికి సంతృప్తిలేదు. హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ లా కొండల్లాంటి కండలు పెంచాలన్నది అతడి ఆశయం. దాంతో, కండరాలు మరింత ఉబ్బెత్తుగా కనిపించేందుకు నువ్వుల నూనెను ఒంట్లోకి ఇంజెక్ట్ చేసుకోవడం మొదలుపెట్టాడు. నువ్వుల నూనెలో పెయిన్ కిల్లర్స్, ఆల్కహాల్ కలిపి ఆ మిశ్రమాన్ని సిరంజీల ద్వారా కండరాల్లోకి ఎక్కించేవాడు.

man trying for arnald kind body fitnessఇది తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తుందని, ప్రాణాంతకం అని డాక్టర్లు హెచ్చరించినా సెగాటో మాత్రం పట్టించుకోవడంలేదు. ధమనులు పూర్తిగా మూసుకుపోయి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని, ఇన్ఫెక్షన్లు కూడా ప్రబలుతాయని డాక్టర్లు చెప్పారు. 50 ఏళ్ల సెగాటో మాత్రం తన కండలను 23 అంగుళాల వరకు పెంచడమే లక్ష్యం అంటూ మూర్ఖంగా నూనె పంపింగ్ చేస్తున్నాడు. గత మూడేళ్లుగా సెగాటో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కండలను పెంచడమే పనిగా పెట్టుకున్నాడు.

Related posts