telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

జేడీ తెలుగుదేశం పార్టీలో అందుకే చేరబోతున్నారు

JD Laxminarayana filed nomination janasena
జె డి లక్ష్మీనారాయణ తెలుగు దేశం పార్టీలో రేపు చేరబోతున్నారు . ఆయన చేరక ముందే వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలకు తెర  తీసింది జె డి రాకతో తెలుగు దేశంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తుండగా వై సి పి లో మాత్రం ఆందోళన  మొదలైంది . లక్ష్మి నారాయణ ఏప్రిల్ 3 , 1965లో కడపలో జన్మించారు . ఆయన విద్యాబ్యాసం  శ్రీశైలం , వరంగల్ , మద్రాస్ లో జరిగింది . 1990లో పోలీస్ డిపార్ట్ మెంట్  చేరారు . తండ్రి  నీటిపారుదల  శాఖ లో అధికారి . మహారాష్ట్ర క్యాడర్ పోలీస్ అధికారి వి వి లక్ష్మీనారాయణ.
సీబీఐ లో  డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్  అఫ్ పోలీస్ వున్నప్పుడు  హైదరాబాద్ పంపించారు . అప్పుడే సత్యం , జగన్ కేసులు లను లక్ష్మీనారాయణ పర్యవేక్షించారు . మొదట ఐదు సంవత్సరాలు డెప్యూటేషన్ మీద పంపించిన సిబీఐ  ఆ తరువాత జాయింట్ డైరెక్టర్ గా పదోన్నతి ఇచ్చి మరో రెండు సంవత్సరాలు పొడిగించింది . జగన్ అక్రమాస్తుల కేసులను బయటికి తీసింది లక్ష్మీనారాయణే . ఈ కాలంలోనే జె .డి పేరు మారుమ్రోగింది . ఆయన  పనితీరు మెచ్చిన ప్రభుత్వం ఆయన పేరును ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ కు సిఫారసు చేసింది . 26  జనవరి 2017న భారత రాష్ట్రపతి లక్ష్మీనారాయణకు  మెడల్  బహుకరించారు . 
EX JD Lakshmi Narayana,TDP
2018న తన పదవికి స్వచ్చందంగా రాజీనామా ఇచ్చి  లీడ్ ఇండియా ఫౌండేషన్ ప్రారంభించి రాష్ట్రమంతా పర్యటించడం మొదలు పెట్టారు . .లక్ష్మి నారాయణకు మొదటి నుంచి రైతులంటే ఇష్టం . వారి సమస్యలను అధ్యయనం  చెయ్యడం మొదలు పెట్టారు . లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీలో చేరతారని కొందరు జనసేనలో చేరతారని మరి కొందరు అనుకున్నారు . కానీ ఎవ్వరు  వు హించని విధంగా  ఆయన తెలుగు దేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు . లక్ష్మీనారాయణను ఘంటా  శ్రీనివాసరావు ఒప్పించాడని తెలిసింది .
వీరిద్దరి మధ్య  హైద్రాబాద్లో ఆదివారం రోజు సమావేశం జరిగింది . వై .ఎస్ .ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఇటీవల  ప్రచారం జరుగుతుంది . దీనికి తోడు కేసీఆర్ , అసదుద్దీన్ ఒవైసీ కూడా ఆంధ్ర లో చంద్ర బాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు . కేసీఆర్ జగన్ అధికారం లోకి రావాలనే ఉద్దేశ్యం తో అన్నివిధాలుగా ఆడుకుంటున్నాడని కూడా చంద్ర బాబు ఆరోపించాడు . ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణ , ఘంటా శ్రీనివాసరావు సమావేశానికి ప్రాధాన్యత  వచ్చింది . చంద్ర బాబు ఆదేశాల మేరకే  ఘంటా  జె .డి తో సమావేశమైనట్టు తెలిసింది . 
JD Lakshmi Narayana
” చంద్ర బాబు పై అటు మోడీ ఇటు కేసీఆర్ కక్ష కట్టారని , ఈ సారి ఎలాగైనా జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోపెట్టాలని పెద్ద కుట్ర జరుగుతుంది . ఒక నేరస్తుడు  రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే … ఆ రాష్ట్ర పరిస్థితి ఊహించలేం . అందుకే ఆర్ధిక నేరస్తుడు … అధికారంలో రాకుండా ఉండాలంటే మీలాంటి వారు చంద్ర బాబుకు చేయూత ఇవ్వాలి ” అని ఘంటా శ్రీనివాసరావు లక్షనారాయణకు చెప్పినట్టు తెలిసింది . ఘంటా  మాటాలకు లక్ష్మీనారాయణ కూడా ఏకీభవించాడని … తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించాడని అంటున్నారు . 
లక్ష్మీనారాణకు నిజాయితీ పరుడైన అధికారిగా మంచి పేరుంది . రైతు  సమస్యలు పట్ల అవగాహన  వుంది . యువతీ యువకులకు పురాణ కలిగించే ఎన్నో ప్రసంగాలు జె డి చేశాడు . లక్ష్మీనారాయణ చేరికతో తెలుగు దేశం పార్టీలో ఉత్సాహం  వచ్చింది . లక్ష్మి నారాయణకు భీమిలి సీట్ కూడా ఖాయమై పోయింది . రేపు చంద్ర బాబు కేబినెట్లో లక్ష్మీనారాయణ  అగ్రికల్చర్  మంత్రి అయ్యే అవకావం వుంది . 

Related posts