telugu navyamedia
సినిమా వార్తలు

మహేష్ తో బాలీవుడ్ బ్యూటీ రొమాన్స్… కీలకపాత్ర కోసం విజయశాంతి ?

Mahesh-babu-with-Sonakshi-Sinha

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయడానికి సిద్ధమవుతున్నాడు మహేష్. ఈ సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాను తీసుకోవడానికి చిత్రబృందం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా సోనాక్షి సిన్హాను టాలీవుడ్ కు పరిచయం చేయడానికి ప్రయత్నాలు చేశారు నిర్మాతలు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు సోనాక్షి బాగా సన్నబడడంతో సూపర్ స్టార్ కు జోడిగా సరిపోతుందని భావించిన దర్శకనిర్మాతలు ఆమెపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇంతకుముందు మహేష్ బాబుకు జోడిగా సాయిపల్లవి, రష్మిక మందన్న పేర్లు విన్పించాయి. కానీ ఇప్పుడు సోనాక్షి పేరు ఎక్కువగా విన్పిస్తోంది. మరోపక్క సినిమాలోని కీలకపాత్ర కోసం విజయశాంతిని రంగంలోకి దింపుతున్నారని తెలుస్తోంది. దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తారని అంటున్నారు. ఈ సినిమా కోసం నటీనటులను ఎంపిక చేసే పనిలో పడ్డారు చిత్రబృందం. సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది.

Related posts