telugu navyamedia
telugu cinema news trending

సుశాంత్ ఆత్మహత్య కేసు : సుశాంత్ మేనేజర్ సిద్ధార్థ్‌ పితానీకి ఈడి నోటీసులు

Sushanth

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ సంచలనంగా మారింది. అతనిది ఆత్మహత్యే అని పోస్ట్‌‌‌‌‌మార్టం రిపోర్ట్‌లో తేలినప్పటికీ.. సుశాంత్ సూసైడ్ చేసుకునేంత పిరికివాడు కాదని, ఈ సూసైడ్ వెనుక బలమైన శక్తులు ఉన్నాయంటూ పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. మరోవైపు సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిపై ఆరోపణలు గుప్పిస్తూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. ఆ వెంటనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)కూడా రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా సుశాంత్ మేనేజర్ సిద్ధార్థ్‌ పితానీకి ఈడి నోటీసులు జారీ చేశారు. ముంబై ఈడీ ముందు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొన్నారు. సుశాంత్ ఆర్థిక లావాదేవీలపై ఆరా తీయనున్నట్లుగా వారు తెలిపారు. సుశాంత్‌తో కలిసి కొన్నాళ్ళపాటు అదే ఇంట్లో ఉన్న సిద్ధార్థ్‌ పితానీ.. ఆయన మరణం తర్వాత పోలీసులు అనుమతితో హైదరాబాద్ చేరుకున్నారు. మరోవైపు సుశాంత్ ఖాతాలో కోట్ల రూపాయలు మాయమయ్యానని పాట్నా పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పటికే ఈ విషయమై సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తికి ఈడీ సమన్లు పంపింది. ఇదిలా ఉంటే రియాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పాలంటూ తనకు ఫోన్ కాల్స్ వస్తున్నట్లుగా సుశాంత్ మేనేజర్ సిద్ధార్థ్‌ పితానీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Related posts

జియో తో పెట్టుకున్నారు.. 3050 కోట్ల జరిమానా కడుతున్నారు..

vimala p

నెటిజన్ కామెంట్ కు ఘాటుగా స్పందించిన నమ్రత

vimala p

వినూత్నంగా `బ్ర‌హ్మాస్త్ర‌` లోగో లాంచ్‌

ashok