telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

భార్యకు జుకర్‌బర్గ్ గిఫ్ట్… బ్రిటిష్ సింగర్ కామెంట్స్

Mark Zuckerberg

ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తన భార్యకు ప్రకాశించే చక్క పెట్టెను బహుమతిగా ఇచ్చారు. తమ పిల్లలు ఉదయం నిద్ర లేచే సమయానికి భార్య ప్రిసిల్లా నిద్రలేవాలని, అస్తమానం ఫోన్‌లో సమయం చూస్తూ గడిపేస్తోందని, దీనివల్ల ఆమె సరిగ్గా నిద్రపోవడం లేదని ఆవేదన చెందిన ఆయన ఈ చక్కపెట్టెను తయారు చేసినట్టు చెప్పారు. ఈ చక్క పెట్టె ఉదయం ఆరు నుంచి ఏడు గంటల వరకు ప్రకాశిస్తుందని, అదే సమయంలో తన పిల్లలు నిద్రలేస్తారని ఆ సమయం వరకు ప్రిసిల్లా ప్రశాంతంగా నిద్రపోవచ్చని అన్నారు. తాను అనుకున్న దాని కంటే ఈ పెట్టె అద్భుతంగా పనిచేస్తోందని, ఎవరికైనా ఈ ఐడియా నచ్చితే ఉపయోగించుకోవచ్చని మార్క్ చెప్పారు. ఈ గిఫ్ట్ గురించి ఇన్‌స్టగ్రమ్‌లో పోస్ట్ పెట్టగా.. కొంతమంది నుంచి విమర్శలు వస్తున్నాయి. భార్య నిద్ర గురించి ఆలోచించే మార్క్ జాత్యహంకారాన్ని అంతం చేయడానికి కూడా ఏదైనా అల్గరిథమ్‌ను కనిపెట్టాలంటూ బ్రిటిష్ సింగర్ లిల్లీ అల్లెన్ కామెంట్ చేసింది. ఇటీవల న్యూజిల్యాండ్‌లో జాత్యహంకారంతో ఓ దుండగుడు కిరాతకంగా 50 మంది ప్రాణాలను బలిగొన్నాడు. రెండు మసీదులో జరిగిన నరమేధాన్ని ఫేస్‌‌బుక్‌లో లైవ్ ఇవ్వడంతో ఆ సంస్థపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. జాత్యహంకార, ద్వేషపూరిత కంటెంట్‌‌ను బ్యాన్ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు గత నెల ఫేస్‌బుక్ ప్రకటించింది.

Related posts