telugu navyamedia
రాజకీయ వార్తలు

రాజీనామా లేఖను పంపించిన కర్నాటక స్పీకర్

Ramesh kumar speaker

కర్నాటక అసెంబ్లీలో స్పీకర్ రమేశ్ కుమార్ భావోద్వేగపూరితంగా ప్రసంగించారు. తాను ఎప్పటికి ఎవరికి తలొగ్గాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. బలనిరూపణ పరీక్షకు సంబంధించి తాను జేడీఎస్-కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నానంటూ బీజేపీ చేసిన ఆరోపణలపై మండిపడ్డారు. తనపై బీజేపీ చేస్తోన్న ఆరోపణలు సరికావన్న స్పీకర్ ..తన రాజీనామా పత్రాన్ని సభలో చూపించారు. ఉదయం నుంచి రాజీనామా లేఖను జేబులో పెట్టుకున్నానని స్పీకర్ చెప్పారు.

సభలో జరిగిన పరిణామాలన్నింటితో తన రక్తం మరిగిపోయిందని స్పీకర్ ఈ సందర్భంగా అన్నారు. సభ్యులు కనీస సంప్రదాయ ప్రక్రియ పాటించకుండా ఇబ్బంది పెట్టారు. స్పీకర్ పదవిలో రాజ్యాంగ బద్దంగా నా బాధ్యతలు నేను నిర్వర్తించాను. తన రాజకీయ జీవితంలో ఏనాడు నైతిక విలువలకు తిలోదకాలు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. స్పీకర్ తన రాజీనామా పత్రాన్ని సిబ్బందితో ప్రతిపక్ష నేత యడ్యూరప్పకు పంపించారు.

Related posts