telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

ఏకంగా ప్రియురాలి ఇంటికే వెళ్లి గొడ్డలితో…

మాజీ ప్రియురాలి ఇంటికే వెళ్లి గొడ్డలితో దాడికి దిగాడు రాహుల్ అనే వ్యక్తి.. యువతి పరిస్థితి విషమించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు కుటుంబసభ్యులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌.. మీర్‌పేట్‌ పీఎస్ పరిధిలోని గుర్రంగూడ టీచర్స్ కాలనీలో మాజీ ప్రియురాలు ఇంటికి వెళ్లి మాజీ ప్రియుడు రాహుల్ అనే వ్యక్తి.. గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు.. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలు కావడంతో.. ఆమె పరిస్థితి విషమంగా మారింది.. వెంటనే ఆస్పత్రికి తరలించారు కుటుంబసభ్యులు.. అయితే, గతంలో తనపై మీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో న్యూసెన్స్ కేసు పెట్టి.. తనను జైలుకు పంపిందని.. బాధితురాలిపై కక్ష పెంచుకున్నట్టుగా తెలుస్తోంది.. ఎలాగైనా యువతని మట్టుబెట్టాలనే ఇంటికే వెళ్లి దాడికి పాల్పడ్డాడని చెబుతున్నారు. ఈ దాడి ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడు రాహుల్‌ కోసం నాలుగు బృందాలను రంగంలోకి దించారు. ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నిందితుడి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు పోలీసులు.

Related posts