telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తాప్సిపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ప్రశంసల వర్షం

Smriti

మిల్కీ బ్యూటీ తాప్సీ నటించిన ‘థప్పడ్’కు అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 28న విడుదల కానుంది. ‘థప్పడ్’ సినిమా గృహహింస అంశం ఆధారంగా రూపొందింది. ఈ సినిమాలో తాప్సీతో పాటు రామ్‌‌కపూర్, కుముద్ మిశ్రా తదితరులు నటించారు. అయితే తాజాగా కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ బాలీవుడ్ భామ తాప్సీ పన్నును పొగడ్తలతో ముంచెత్తారు. తాప్సీ అప్‌కమింగ్ ఫిల్మ్ ‘థప్పడ్’పై స్మృతి అభినందనల వర్షం కురిపించారు. దీనితో పాటు స్మృతి ఇరానీ… ‘స్త్రీపై చేయి ఎత్తడం తగినది కాదని, అటువంటప్పుడు ఆమె ఒక్క చెంప దెబ్బ కొట్టగలదని’ అన్నారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ‘థప్పడ్’ సినిమా ట్రైలర్‌ను షేర్ చేశారు. దీనితో పాటు ఆమె ‘ స్త్రీలే అడ్జెస్ట్ కావాలని చాలా మంది చెబుతుంటారు. ఇటువంటి మాటలు చాలాసార్లు విన్నాను. పేద మహిళలను వారి భర్తలు ఎందుకు కొడుతుంటారు? అలాగే చదువుకున్న మహిళలపై ఎవరూ చేయి ఎత్తరని చాలామంది నమ్ముతుంటారు. అయితే చాలామంది చదువుకున్న అడబిడ్డలు, కోడళ్లు తమకు ఇటువంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయని చెబుతుంటారు. అయితే ఈ చిత్రం ట్రైలర్ చూశాక ఎంతో ఆనందం కలిగింది’ అని స్మృతి కామెంట్ రాశారు. తాను ఈ సినిమాను తప్పకుండా చూస్తానని, అందరూ తమ కుటుంబ సభ్యులతో సహా ఈ సినిమా చూడాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలపై చేయి ఎత్తడం తగినది కాదు… దానికి ఒక్క చెంపదెబ్బ సరిపోతుంది అని పేర్కొన్నారు.

Related posts