telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

రైలు ప్రమాదం దృష్ట్యా.. పలు రైళ్ల దారి మల్లింపు…

simanchal rail accident news

సీమాంచల్ రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ రైలు ప్రమాదంలో ఏడుగురు మరణించడంతోపాటు 27 మంది గాయాల పాలయ్యారు. ఈ ఘటన తో ఆరు రైళ్లను దారి మళ్లించారు. ఈ ఘటన అనంతరం గౌహతి -ఆనంద్ విహార్ టెర్మినల్ నార్త్ ఈస్ట్ ఎక్స్ ప్రెస్, జోగబాని-ఆనంద్ విహార్ టెర్మినల్ సీమాంచల్ ఎక్స్ ప్రెస్, సహస్ర- పాటలీపుత్ర జనహిత ఎక్స్ ప్రెస్, ఢిల్లీ – దిబ్రుఘడ్ ఎక్స్ ప్రెస్, న్యూఢిల్లీ- దిబ్రూఘడ్ టౌన్ రాజధాని ఎక్స్ ప్రెస్, ఆనంద్ విహార్- నాహర్లాగూన్ అరుణాచల్ ఎక్స్ ప్రెస్ రైళ్లను దారి మళ్లించారు. దానాపూర్ – మొకామా మార్గంలో రాకపోకలు సాగించే రైళ్లన్నీ దానాపూర్ -పాటలిపుత్ర- బరౌనీ పాట్నా జంక్షన్ మీదుగా మళ్లించారు.

పలు రైళ్లను హాజీపూర్- ముజప్ఫర్ నగర్- సమస్తిపూర్ లమీదుగా నడుపుతామని రైల్వే అధికారులు చెప్పారు. రైలు పట్టా విరిగినందునే ఈ రైలు ప్రమాదం జరిగిందని తేలిందని అధికారులు స్పష్టం చేశారు.

Related posts