telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఆర్టీసీ కూడా.. ఇక నుండి హోమ్ డెలివరీ…

Passengers troubles in 47 root Hyderabad

బస్సులో ప్రయాణించే వారితోపాటుగా కొద్దిపాటి సామాను కూడా తీసుకెళ్లారు. అయితే ఆర్టీసీ పై ప్రజల నమ్మకంతో వస్తురవాణా కూడా జరుగుతుంది. దానిని ఇప్పటి వరకు ఆయా బస్ స్టాండ్ లకు వెళ్లి డెలివరీ తీసుకుతుంటాం. ఇక నుండి అలా కాకుండా ఆయా వస్తువులు నేరుగా ఇంటికే తెచ్చి ఇస్తామంటుంది ఆర్టీసీ కూడా. అంటే, డోర్ డెలివరీ కాలం కదా.. ఆర్టీసీ కూడా అప్ గ్రేడ్ అవుతుందేమో! ఆర్టీసీ పార్శిల్స్‌, కొరియర్‌ సేవలు ఇక మీ ఇంటి తలుపులు తట్టనున్నాయి! ఫ్లిప్‌కార్ట్‌ , అమెజాన్‌ తరహాలో బెజవాడలో బెజవాడలో పార్శిల్స్‌, కొరియర్‌ సేవలను ఇంటింటికీ అందించటానికి రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ప్రయోగాత్మక కార్యక్రమం చేపడుతోంది.

కార్గో ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవాలన్న ఉద్దేశ్యంతో నేరుగా ఇంటింటికే పార్శిల్స్‌, కవర్లను డోర్‌ డెలివరీ చేయాలని నిర్ణయించిన ఆర్టీసీ డెలివరీ ఏజన్సీల కోసం టెండర్లను పిలిచింది. ఆర్టీసీ పార్శిల్స్‌ను డెలివరీ చేయటానికి డెలివరీ ఏజన్సీల నుంచి కూడా ఆసక్తి వ్యక్తమౌతోంది. మరికొద్ది రోజులలో రోడ్డు రవాణా సంస్థ టెండర్లను ఖరారు చేసి నగరంలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని పరీక్షించనుంది.

ప్రజా రవాణాతో పాటుగా కార్గో రంగంలోకి దిగాలని నిర్ణయించిన రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ముందుగా పార్శిల్స్‌ , కొరియర్‌ సేవలను ప్రారంభించింది. 2017 – 18 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించిన పార్శిల్స్‌, కొరియర్‌ సేవల ద్వారా కృష్ణా రీజియన్‌రూ.7 కోట్ల ఆదాయం వచ్చింది. అంతకు ముందు ఏఎల్‌ఎన్‌ సంస్థ నిర్వహించే పనిని ఆర్టీసీ చేపట్టడం ద్వారా సంస్థకు ఆదాయం లభించింది. ఖర్చులు కంటే రాబడి ఎక్కువుగా ఉండటంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడా దీనిపై మరింత దృష్టి సారించారు. ఆర్టీసీకి విస్తృత స్థాయిలో బస్సులు అందుబాటులో ఉండటం రోజూ స్థానికంగా, దూర ప్రాంతాలకు నిర్ణీత సమయాలలో బస్సులు అందుబాటులో ఉండటం ద్వారా పార్శిల్స్‌ , కొరియర్‌ చాలా వేగంగా జరుగుతోంది. దూరప్రాంతాలకు అయితే గరిష్టంగా ఒక రోజులేనే గమ్యస్థానానికి చేరుకుంటోంది. ప్రజలు ఇప్పటికే ఆర్టీసీ పై నమ్మకంతో రోజు వారివారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు, ఆ నమ్మకమే ఈ హోమ్ డెలివరీ కి కూడా ఊతం కానుంది.

Related posts