telugu navyamedia
రాజకీయ

ఆయన ప్రధాని  అయితే..  అండగా నిలబడతా: దేవెగౌడ

Rahul Side PM Says Deve Gowda
ప్రస్తుతానికి తనకు ఎలాంటి రాజకీయ ఆశయాలు లేవని మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్‌ అధినేత దేవెగౌడ  తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయబోనని కొన్ని సంవత్సరాల కిందట ప్రకటించిన ఆయన మళ్లీ ఎన్నికల బరిలోకి నిలువడం కొత్త చర్చకు దారితీసింది. 85 ఏళ్ల వయస్సులోనూ ఆయన కర్ణాటక తూముకూర పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల ఆమోదం ఉంటే ఏకగ్రీవ అభ్యర్థిగా దేవెగౌడ మళ్లీ ప్రధానమంత్రి అవుతారని ఆయన తనయుడు కుమారస్వామి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 
ఈ నేపథ్యంలో తాజాగా ఏఎన్‌ఐ వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన దేవెగౌడ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గతంలోనే ఎన్నికల నుంచి తప్పుకొంటానని ప్రకటించినా.. మళ్లీ పరిస్థితులు తనను పోటీ చేసేలా చేశాయాని దేవెగౌడ తెలిపారు. తన పార్టీని కాపాడుకోవడమే తన ప్రధాన ఉద్దేశమని తెలిపారు. 
ఏకగ్రీవ అభ్యర్థిగా దేవెగౌడ మళ్లీ ప్రధానమంత్రి అయ్యే అవకాశముందని ఆయన తనయుడు, కర్ణాటక సీఎం హెచ్‌డీ దేవెగౌడ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆ విషయం గురించి నేనేమీ ఆలోచించడం లేదన్నారు. రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి అయితే.. ఆయనకు అండగా నిలబడతానని అన్నారు.  చిన్న పార్టీ అయినప్పటికీ, తమకు సోనియాగాంధీ కర్ణాటకలో మద్దతు ప్రకటించారని, కాంగ్రెస్‌ పార్టీతో కలిసి సాగాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు.

Related posts