telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సెక్రటేరియట్ కూల్చివేత పనులు ప్రారంభం

telangana secretariate

తెలంగాణ హైకోర్టు తీర్పుతో సచివాలయ కొత్త భవన నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో పాత సెక్రటేరియట్ భవనం కూల్చివేత పనుల ప్రక్రియ ప్రారంభమైంది. పోలీసులు భారీ బందోబస్తు మధ్య ఈ తెల్లవారుజాము నుంచే భారీ యంత్రాలతో భవనం కూల్చివేత పనులు చేపట్టారు. ఆ వైపుగా వాహనాలు రాకుండా రోడ్లను మూసివేశారు. కూల్చివేత పనుల ప్రక్రియ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలైనాయి. దీంతో నిర్మాణ పనుల్లో జాప్యమేర్పడింది.

సచివాలయ భవనం కూల్చివేతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు ఇటీవల ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. పాత భవనాన్ని కూల్చివేసి ఆ స్థానంలో కొత్తదాన్ని నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే పనులు ప్రారంభించింది.

Related posts