telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“వజ్ర కవచధర గోవింద”గా సప్తగిరి

Sapthagiri

తనదైన డైలాగ్ డెలివరీతో… బాడీ లాంగ్వేజ్ తో, కామెడీ టైమింగ్ తో హాస్య నటుడుగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు సప్తగిరి. దీంతో సప్తగిరి హీరోగా అవకాశం వచ్చింది. “సప్తగిరి ఎక్స్ ప్రెస్” సినిమాతో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుని, మంచి మార్కులే కొట్టేశాడు. ఆ తరువాత చాలాకాలం గ్యాప్ తీసుకున్న సప్తగిరి మళ్ళీ హీరోగా తెరమీద సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. “సప్తగిరి ఎక్స్ ప్రెస్” సినిమా దర్శకుడు అరుణ్ పవార్ తోనే తాజా సినిమా చేయనున్నాడు సప్తగిరి. శివ శివమ్ ఫిలింస్ పతాకంపై నిర్మించనున్న ఈ సినిమాకు ఇప్పటికే “వజ్ర కవచధర గోవింద” అనే టైటిల్ ను ఖరారు చేశారు. నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. వైభవీ జోషీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అర్చనా వేద, అవినాష్, రాజేంద్ర జాన్ కొట్టోలి, టెంపర్ వంశీ, అప్పారావు, వీరేన్ తంబిదొరై తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. ఇదొక హిలేరియస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని, ఇప్పటికి 60 శాతం చిత్రం పూర్తయిందని తెలిపారు నిర్మాతలు. మరి ఈ సినిమాతో సప్తగిరి హీరోగా ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

Related posts