telugu navyamedia
telugu cinema news

“భారత్” ఫస్ట్ లుక్… గడ్డంతో సల్మాన్

Bharath

బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా నటిస్తున్న చిత్రం “భారత్”. ఇటీవల ఈ చిత్రం టీజర్ విడుదలైంది. టీజర్ లో నేవీ ఆఫీసర్ లుక్ లో కన్పించిన సల్మాన్ ఖాన్ “నీ జాతి నీ ధర్మం ఏమిటని అడిగేవారికి నేను స్మైల్ తో ఇచ్చే సమాధానం… నా తండ్రి నాకు భరత్ అని దేశానికి ఉన్న గొప్ప పేరును పెట్టారు. అలాంటి గొప్ప పేరుకు నా జాతి ధర్మం, ఇంటిపేరుని తగిలించి…. నా పేరుకు, దేశానికి ఉన్న గౌరవాన్ని తక్కువ చేయదలచుకోలేదు” అంటూ సల్మాన్ ఖాన్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. అలీ అబ్బాస్ జాఫ‌ర్ తెర‌కెక్కిస్తున్న భార‌త్ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను ఇవాళ రిలీజ్ చేశారు. బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ .. భార‌త్ ఫిల్మ్ పోస్ట‌ర్‌లో కొత్త‌గా క‌నిపిస్తున్నాడు. త‌ల‌వెంట్రుక‌లు తెల్ల‌బ‌డి, గ‌డ్డం కూడా తెల్ల‌బ‌డిన గెట‌ప్‌తో స‌ల్మాన్‌.. భార‌త్ పోస్ట‌ర్‌లో ఇంట్రెస్టింగ్‌గా ద‌ర్శ‌న‌మిస్తున్నాడు. తల‌లో, గ‌డ్డంలో ఉన్న తెల్ల వెంట్రుక‌ల క‌న్నా.. త‌న జీవితంలో ఎన్నో రంగులు ఉన్నాయ‌ని త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో భార‌త్ పోస్ట‌ర్‌ను షేర్ చేసి దానికి ట్యాగ్‌లైన్ పెట్టాడు స‌ల్మాన్ . 2019లో ఈద్ కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. గత ఏడాది ఖాన్ త్రయం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. అందులో సల్మాన్ ఖాన్ నటించిన “రేస్-3” చిత్రం భారీ అంచనాలతో విడుదలైంది. కానీ ఆశించిన అంచనాలను అందుకోలేకపోయింది. ఈ ఏడాది ఎలాగైనా “భారత్” సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు సల్మాన్ ఖాన్.

Related posts

ప్రభాస్ తో భారీ ప్రాజెక్ట్ కు సిద్ధమవుతున్న బాలీవుడ్ నిర్మాత ?

vimala p

“ఆర్ఆర్ఆర్” స్పెషల్ సాంగ్ లో రకుల్ ?

vimala p

షూటింగ్ పూర్తి చేసుకున్న అక్కినేని స‌మంతనాగ‌చైత‌న్య‌ల ‘మ‌జిలీ’..

vimala p