telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఓ ఇంటివాడైన డైరెక్టర్ సుజీత్

Sujeeth

టాలీవుడ్ లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. వరుస బెట్టి అందరూ పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. ఇప్పుడు డైరెక్టర్ సుజీత్ వంతు వచ్చింది. ఆదివారం తన ప్రియురాలు మెడలో మూడు ముళ్ళు వేసి ఓ ఇంటి వాడయ్యాడు. సుజీత్ తన మొదటి సినిమా శర్వానంద్ తో రన్ రాజా రన్ తీసి హిట్టు కొట్టారు. ఆ వెంటనే రెబల్ స్టార్ ప్రభాస్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ప్రభాస్ తో చేసిన ‘సాహో ‘ కు తెలుగులో మిశ్రమ స్పందన వచ్చినా బాలీవుడ్ లో మంచి విజయం సాధించింది. ప్రస్తుతం సుజిత్ చిరంజీవి కోసం మలయాళ లూసిఫర్ ని తెలుగు ప్రేక్షకులకనుగుణంగా స్క్రిప్ట్ సిద్ధం చేశారు. అయితే చిరంజీవి దీనిపై తుది నిర్ణయం తీసుకోవలిసి ఉంది. శర్వానంద్ లేదా గోపిచంద్‌తో కూడా ఓ మూవీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల తన ప్రేయసి ప్రవల్లికతో గోల్కొండ రిసార్ట్స్‌లో నిశ్చితార్ధం జరుపుకున్న సుజీత్ ఆగస్ట్ 2న కొద్ది మంది ఆత్మీయుల సమక్షంలో పెళ్లి పీటలెక్కాడు. సుజీత్, ప్రవల్లిక పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ప్రవల్లిక వృత్తి రీత్యా డాక్టర్ కాగా, ప్రస్తుతం స్క్రీన్ ప్లే రైటర్‌గా పనిచేస్తుంది. టిక్ టాక్ లో కూడా ఆమె మంచి పేరుంది. కొంత కాలంగా ప్రేమలో ఉన్న వీరు పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నారు. అయితే సుజీత్ తన పెళ్ళికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ ప్రకటన చేయలేదు.

Related posts