telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

భారతదేశ “మూలచుక్క”

అంటు ముట్టని వాడలో
అగ్నిని రాజేసింది
అడుగు పెట్టని వాడలో
క్రాంతి జ్యోతై నిలిచింది
మూగ జీవులకు
మాటలు నేర్పింది!

వెలివాడను సాగు చేసి
పిడికెడు అక్షరాలను చల్లి
నిలువెత్తు ఆత్మగౌరవాన్ని
నిలబెట్టింది!

మనువాద మాయమాటలను
చెల్లనీవ్వలే
కట్టుబాట్ల ఉక్కు సంకెళ్ళను
అక్షరాయుధంతో తెగ నర్కింది
రాయి దెబ్బలు తిన్న
ఫలాల వృక్షమై,తిరుగుబాటు జెండాను
ఎగురవేసింది!

సత్యకామ జాబిల్లే సావిత్రమ్మ
లోకాయుత వెలుగే సావిత్రమ్మ
జ్యోతిరావు బోదనలే సావిత్రమ్మ
సమత ధర్మమే సావిత్రమ్మ
సత్యమార్గమే సావిత్రమ్మ
భారతదేశ “మూల చుక్క”
మా చదువుల తల్లి సావిత్రమ్మ

అందుకో వేల వేల వందనాలు

Related posts