telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పడక గదిలో కెమెరాలు పెడతాం అంటే… మాధవీలత వార్నింగ్

Madhavilatha

గత కొంతకాలంగా సినీ నటి, బీజేపీ యువ నాయకురాలు మాధవీలతను లక్ష్యంగా చేసుకుని కొందరు బీజేపీ నేతలతో పాటు.. పలువురు నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో మాధవీలత ఫేస్‌బుక్ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టింది.

“నేను పార్టీ లో చేరినపుడు ఒక మాట చెప్పాను
ఇపుడు అదే మాట మీద ఉన్నాను
నా పార్టీ ఐన తప్పు చేస్తే తప్పే బారాబర్ చెప్తా…
నన్ను దూరం పెడతారు అనే భయం లేదు
దూరం అవుటా అన్న బెంగ లేదు
నేనెపుడు దేశం కోసం దర్మం కోసం పని చేస్తాను
మనుషుల కోసం వత్తాసుల కోసం కాదు
సమయం సందర్భం చూసి
ఎవరు ఎక్కడ రాజకీయ కుట్రలు చేస్తున్నారో
చెప్పేస్తా
మోడీజీ స్టైల్ లో
పేరు చెప్పను
కానీ ఎదుటోడికి తెలిసిపోద్ది ఇతడైపోద్ది

ఇది పగ కాదు ప్రతీకారం కాదు
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంది
బుధ్యతారాహిత్యంగా ఉండటం తప్పు
తమ సొంత అవసరాలకి ఆబ్లిగేషన్స్ కి
లొంగటం తప్పు

నా అదృష్టానికి కాదు ఇప్పటివరకు
జనాల అదృష్టానికి నా జోలికి ఎవరు రాలేదు
అందరు పద్దతిగా మర్యాదగా హుందాగా నాతో వ్యవహరించడం చూసాను … కనుక
నేనెపుడు మాట్లాడలేదు
వృత్తి పరంగా బాధ్యతలు తప్పేవాళ్ళకి అపుడపుడు చురకలు వేస్తూనే ఉంటా నా స్టైల్ లో

నేను ప్రజల కోసం పని చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను …
ఎవరికీ బానిసని కాను ఊడిగం చేయను
అడుక్కొను
అవసరం లేదు
సినిమా రంగం లో సమస్యలు తెలిసే వచ్చా
పోరాడే తెలివి ఉంది కనుక అలాగే బతికా
రాజకీయం లో చదరంగం తెలిసి ఉండాలి
నాకు అంతగా రాదు ఐన తెగించి వచ్చా
పోరాడే శక్తీ ఉందని నా బలం నా ధైర్యమే
ఎవరికీ భయపడే పని లేదు
నాకు నచ్చి వచ్చాను
నచ్చకపోతే వెళ్ళిపోతాను
ఎవరికీ నన్ను ప్రశ్నించే హక్కు లేదు
సమాజ సేవ అనేది నా సొంత బాధ్యత నా సొంత ఆలోచన
నేను ఎవరికీ బానిసను కాను
జవాబుదారీ కాను
ఇపుడు ఇది ఎందుకు అంటారా ఏమో చెప్పాలి అనిపించింది చెప్తున్నా
….
పార్టీ ఎప్పటికి మంచిదే కానీ మనుషులంతా
మంచోళ్ళా అంటే ఎప్పటికి కాదు అనే అంటాను

మాట మార్చను

కాకపొతే అన్ని అవసరాలే
అదే నాకు నచ్చదు కానీ నా వలన ప్రజలకి మంచి జరుగుతుందేమో అని ఆశ
ఆశ లేకుంటే మనిషి బతకడం ఎందుకు
ఎవరి రాజకీయ కుట్రలకు నేను బలియైపోను
ఎవరిని సహించను
నేనుంతే మీకు ముక్కు సూటితనం పనికొస్తాదా అంటే
వచ్చిన రాకున్నా నేనెవరికోసం తెర వెనక నటించే పని లేదు … నా వ్యక్తిగత జీవితం ఎవరికైనా అనవసరం
పక్కవాళ్ళ జీవితం లో వేలు కాళ్ళు పెట్టడం సంస్కార హీనం ,, నీచం సోషల్ మీడియా సైకోలకి చెప్తున్నా
మీ అమ్మ నాన్న నేర్పించలేదేమో పక్కవాళ్ళ పర్సనల్ విషయాల్లో జోక్యం అంటే అది నీచం ఛండాలం అది క్రైమ్ అని
కనుక ఎవరి జీవితాల జోలికి ఎవరు వెళ్ళకపోవడం మంచిది ఇక్కడెవరు మంచోళ్ళు లేరు మడి కట్టుకున్నోళ్ళు లేరు .. మీ జీవితం మీరు చూసుకుంటే గొప్పవాళ్ళు అవుతారు కాదు ఎపుడు ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో పరాయివల్ల మీద బూతులు అవాకులు చవాకులు ఏడుస్తుంటే అలానే ఏడుస్తూనే ఉంటారు … కనుక అంతో ఇంతో అమ్మ నాన్న కు పుట్టి ఉంటె పద్దతిగా ఉండండి కాదు మాకు వేరే పని లేదు మెం ఎపుడు వాళ్ళ మీద వీళ్ళ పడి ఏడుస్తాం ఇదే మా పని
పక్కింట్లోకి తొంగి చూస్త , పడక గదిలో కెమెరాలు పెడతాం ఫేస్బుక్ లో దూరి జనాలని తిడతాం అంటే
మీ కర్మకి మీరే బాద్యులు .. పక్కవారి మంచి కోరుకుంటే మీరు బాగుంటారు
కాదు పరాయివల్ల నాశనం కోరుకుంటూ చావు కోరుకుంటూ అంత చెడ్డోళ్లు మేమె మంచోళ్ళమ్ అనుకుంటూ నీచంగ దిగజారేవాళ్లకి
ఎప్పటికి దిగజారుడు బతుకుగానే ఉంటుంది
మన కదలిక పది మందికి సంతోషాన్ని ఇవ్వాలి
అశాంతిని కాదు
మీ మాటలు మీ నవ్వు పక్కన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటే మీరు సరిగ్గా లేనట్లు
ఒకటిని సంతోష పెట్టకపోయినా పరవాలేదు బాధ పెట్టొద్దు ఎవరి అశాంతికి కారణం కావొద్దు
మీ మనశాంతికి ఎవరు భంగం కలిగించిన
దూరంగ ఉండండి అలంటి వారు నీడ కూడా
పడనివ్వకండి అని నా సలహా

నా ఇష్టం …..

MAADHAVI LATHA PASUPULETI”

Related posts