telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనా నుంచి కోలుకున్న అమితాబ్… కానీ…!

Amitab

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కుటుంబం కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. అమితాబ్ బచ్చన్‌తో పాటు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్, మనవరాలు ఆరాధ్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. వీరంతా ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో చేరారు. ఇప్పటికే ఐశ్వర్యరాయ్, ఆరాధ్యకు నెగిటివ్ రావడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా అమితాబ్ బచ్చన్‌కు కొవిడ్ నెగిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని అభిషేక్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అయితే, తనకు మాత్రం పాజిటివ్ వచ్చిందని చెప్పారు. “తాజాగా చేసిన కొవిడ్-19 పరీక్షలో మా నాన్నకు నెగిటివ్ అని నిర్ధారణ అయ్యింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఆయన ఇంట్లో ఉంటూ విశ్రాంతి తీసుకుంటారు. ఆయన కోలుకోవాలని కోరుకున్న, ప్రార్థనలు చేసిన వారికి ధన్యవాదాలు” అని అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. అయితే తాను కరోనా నుంచి ఇంకా కోలుకోలేదని మరో ట్వీట్‌లో వెల్లడించారు. “దురదృష్టవశాత్తు నాకు మళ్లీ కొవిడ్-19 పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం నేను హాస్పిటల్‌లోనే ఉన్నాను. నా కుటుంబం కోలుకోవాలని నిరంతరం కోరుకుంటోన్న, ప్రార్థనలు చేస్తోన్న వారికి మరొకసారి ధన్యవాదాలు. మీ అందరికీ రుణపడి ఉంటాం. ఈ కరోనాను నేను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తాను. ప్రామిస్” అని అభిషేక్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. అమితాబ్‌కు కొవిడ్ నెగిటివ్ రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అభిషేక్ కూడా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

Related posts