telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ఆర్టీసీ సమ్మెతో అంతా దోపీడే.. అన్నీ బస్సుల్లో రెట్టింపు చార్జీలు!

rtc strike buses

టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రభుత్వం ప్రైవేట్‌వాహనాలకు అనుమతులివ్వడంతో ఇదే అవకాశంగా భావించి అందినకాడికి దండుకుంటున్నారు. ఆర్టీసీ అద్దె బస్సుల్లోనూ అధిక చార్గీలు వసూలు చేస్తునారు. సమ్మె కారణంగా ప్రైవేట్‌ దోపిడీతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొన్నారు. పండగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేందుకు దాదాపు 50శాతం అధిక చార్జీలుసమర్పించారు.

ఇక ఎంజీబీఎస్, జేబీఎస్‌ల నుంచిఆదివారం రెండు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు దాదాపు 2వేల బస్సులునడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. సాధారణ రోజుల్లోహైదరాబాద్‌–విజయవాడ నాన్‌ ఏసీబస్‌ చార్జీ రూ.370, ఖమ్మంకు రూ.250, కరీంనగర్‌కు రూ.200… కానీ ఆదివారం వరుసగా రూ.900, రూ.500, రూ.400 వసూలు చేశారు. ఇలా ఒక్క ప్రాంతమని కాదు… తెలుగు రాష్ట్రాల్లోని ఏ ప్రాంతానికైనా రెట్టింపు చార్జీలు వసూలు చేసి ప్రయాణీకుల నడ్డీ విరుస్తున్నారు.

గ్రేటర్‌ పరిధిలో 29 డిపోల్లోని మొత్తం 3,800 బస్సులకు గాను.. ఆదివారం కేవలం 1,200 బస్సులే రోడ్డెక్కాయి. వీటిలో 370 అద్దె బస్సులున్నట్లు అధికారులు తెలిపారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల సాయంతో బస్సులను నడిపినట్లు పేర్కొన్నారు. అయితే ఈ బస్సుల్లోనూ కండక్టర్లు చేతివాటం ప్రదర్శించి ప్రయాణికుల జేబులు గుల్ల చేశారు. తక్కువ దూరాలకు రూ.10 చార్జీకి రూ.20 వసూలు చేస్తున్నారు. ఎస్ ఆర్ రాయడం లేదు టికెట్లు ఇవ్వడం లేదు. ఇష్టానుసారంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు.

Related posts