telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

జగన్ పుట్టిన రోజున గ్రామ వార్డు సచివాలయ దినోత్సవం…

cm jagan

డిసెంబర్ 21న ఏపీ ముఖ్యమంతి జగన్ పుట్టినరోజు. అయితే ఈ కారణంగా ఏపీ గ్రామ, వార్డు సచివాలయ సంఘం రాష్ట్ర కార్య నిర్వాహక కమిటీ సమావేశం అయి నూతన కమిటీ ఎంపిక చేశారు. కమిటీ గౌరవ అధ్యక్షులుగా వెంకట్ రామ్ రెడ్డి, అధ్యక్షుడిగా  జి.వి. రాఘవరెడ్డి జనరల్ సెక్రెటరీగా శ్రీ అంకమ్మ రావు సహా 30 మందితో కమిటీ ఏర్పాటు అయింది. సీఎం జగన్ పుట్టిన రోజైన డిసెంబర్ 21న గ్రామ వార్డు సచివాలయ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీ గ్రామ, వార్డు సచివాలయ సంఘం గౌరవాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ వంద ఉద్యోగాలు ఇవ్వడానికే ప్రభుత్వాలు సతమతమవుతున్న రోజుల్లో కేవలం అధికారంలోకి వచ్చిన  మూడు నెలల కాలంలో లక్ష 30 వేల ఉద్యోగాలు ఇచ్చారని ఆయన అన్నారు. ఇంతటి సాహసోపేత నిర్ణయం తీసుకోగల నాయకుడు వైయస్ జగన్ మాత్రమేనని ఆయన అన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా లక్షలాది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారని ప్రభుత్వ సేవలను ప్రజలకు వారి ఇంటి ముందే అందించే ఒక బృహత్తరమైన కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారని అన్నారు. సీఎం జగన్ జన్మదినం డిసెంబర్ 21వ తేదీని గ్రామ వార్డు సచివాలయ దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించామని ఆయన అన్నారు. చూడాలి మరి దీనికి అందరూ ఒప్పుకుంటారా అనేది.

Related posts